Ahaan Panday's Saiyaara OTT Release Date On Netflix: చిన్న సినిమాగా వచ్చి కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ 'సైయారా'. అహాన్ పాండే, అనీత్ పడ్డా ఈ మూవీతోనే బాలీవుడ్‌కు పరిచయం కాగా... జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బీటౌన్ చిత్రాల కలెక్షన్స్ దాటి రికార్డులు క్రియేట్ చేసింది. ఇండియాలో దాదాపు రూ.270.75 కోట్లు వసూళ్లు సాధించగా... వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.577 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా నిలిచింది.

Continues below advertisement


ఎందులో స్ట్రీమింగ్ అంటే?


ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో ఈ నెల 12 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసిన మూవీ లవర్స్ ఖుష్ అవుతున్నారు. 






Also Read: కట్టె కాలే వరకూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే నా లైఫ్ - 'కిష్కింధపురి' అసలైన గూస్ బంప్స్ అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్


ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మోహిత్ సూరి తెరకెక్కించారు. కొత్త వారితో లవ్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి రికార్డు క్రియేట్ చేశారు. మ్యూజిక్ కూడా అదనపు బలంగా నిలిచింది. రిలీజ్ అయిన 4 రోజుల్లోపే కేవలం మౌత్ టాక్‌తోనే హిట్ కొట్టి దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది 'సైయారా' (Saiyaaraa). ఓవర్సీస్‌లోనూ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించింది.


స్టోరీ ఏంటో తెలుసా?


వాణి బత్రా (అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీలో సీనియర్ మహేశ్‌ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. పెద్దవాళ్లను కూడా అందుకు ఒప్పిస్తుంది. అయితే, చివరి నిమిషంలో వాణిని వదిలేసి మహేష్ వెళ్లిపోతాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన వాణి బాధ నుంచి కోలుకునేందుకు ఓ కంపెనీలో జాబ్‌కు వెళ్తుంది. అక్కడ అనుకోకుండా క్రిష్ కపూర్ (అహన్ పాండే)ను కలుస్తుంది. అతను సింగర్‌గా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ కావాలని కోరుకుంటాడు. 


క్రిష్ వాణి ఇద్దరూ కలిసి ఓ పాట చేయాల్సి వస్తుంది. అలా ఇద్దరూ కలిసి పని చేస్తూనే ప్రేమలో పడతారు. అయితే, సడన్‌గా వాణి లైఫ్‌లోకి ఆమె పాత బాయ్ ఫ్రెండ్ మహేష్ వస్తాడు. ఆ టైంలో ఆమె ఏం చేసింది? క్రిష్ లవ్‌ను ఏం చేసింది? మహేష్‌తో ఆగిపోయిన పెళ్లి మళ్లీ జరిగిందా? లేక క్రిష్, వాణి ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.