Rajinkanth's Coolie OTT Streaming On Amazon Prime Video: తమిళ సూపర్ స్టార్ రీసెంట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 14న రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కూలీ స్ట్రీమింగ్ అవుతోంది. 'ప్రేమ, ప్రమాదం ఒకదానిలో ఒకటిగా మారాయి. కూలీ తుపానును వీక్షించండి.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో తలైవా రజినీకాంత్ దేవా పాత్రలో అదరగొట్టగా విలన్ సైమన్‌గా కింగ్ నాగార్జున నటించారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేశారు.
Also Read: మనవడిని చూసి మురిసిపోయిన మెగాస్టార్... వరుణ్ తేజ్ కొడుకుతో చిరు ఫోటో!
మరో ఓటీటీలోకి హిందీ వెర్షన్
అయితే, హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. త్వరలోనే మరో ఓటీటీలోకి హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తలైవా, నాగార్జునతో పాటు ఉపేంద్ర, రచితా రామ్, శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
కింగ్ పిన్ లాజిస్టిక్ ఓనర్ సైమన్ (నాగార్జున) ప్రభుత్వం నుంచి విశాఖ పోర్టును లీజుకు తీసుకుని దాని కేంద్రంగా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటాడు. అతని అక్రమ వ్యాపారానికి దయాల్ (సౌబిన్ షాహిర్) సపోర్ట్ చేస్తూ ఆ పోర్టును తన అండర్‌లోనే ఉంచుకుంటాడు. ఈ అక్రమాలను బయట పెట్టాలని చూసిన వారిని అక్కడికక్కడే చంపేస్తుంటాడు. అయితే, అన్ని శవాలను మాయం చేయడం ఈ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. ఇదే టైంలో రాజశేఖర్ (సత్యరాజ్) కనిపెట్టిన ఓ మొబైల్ క్రిమేటర్ గురించి తెలుసుకున్న సైమన్ తనతో పని చేయాలంటూ రాజశేఖర్‌ను బలవంత పెడతాడు.
గత్యంతరం లేని స్థితిలో రాజశేఖర్ తన కూతురు ప్రీతి (శ్రుతిహాసన్) తో కలిసి సైమన్ వద్ద పనిచేస్తాడు. ఇంతలో అనుకోకుండా ఓ రోజు రాజశేఖర్ చనిపోతాడు.ఈ విషయం తెలుసుకున్న అతని ప్రాణ మిత్రుడు దేవా (రజినీకాంత్) రాజశేఖర్‌ది హత్య అని గుర్తించి హంతకులను వేటాడే పనిలో పడతాడు. ఇదే క్రమంలో పోర్టులో జరిగే బిజినెస్ నార్మల్ స్మగ్లింగ్ కాదని... వేరేది ఉందని తెలుసుకుంటాడు. అసలు దేవాకు తెలిసిన నిజం ఏంటి? తన స్నేహితులను చంపిన వారిని దేవా ఏం చేశాడు? పోర్టులో జరిగే అక్రమాలతో పాటు జరిగే అతి పెద్ద ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? సైమన్‌కు దాహా (ఆమిర్ ఖాన్)కు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.