రియాలిటీ షోస్ చాలా ఉన్నాయి. అయితే పాటలతో లేదంటే కామెడీతో మెజారిటీ షోస్ నడుస్తున్నాయి. గేమ్ షోస్ చాలా తక్కువ. ఆ లోటు భర్తీ చేసేందుకు, సామాన్య ప్రజలకు పది లక్షల రూపాయల కారు అందించేందుకు సరికొత్త గేమ్ షోతో వస్తున్నామని ప్రజా ఆర్ట్స్ తెలిపింది.
ది లక్... విజేతకు పది లక్షల కారు!మన భారతదేశంలో సామాన్యుల కోసం రూపొందుతున్న అతిపెద్ద మొట్టమొదటి రియాలిటీ షో 'ది లక్' అని, ఇందులో విజేతగా నిలిచిన వారికి రూ. 10 లక్షల కారు బహుమతిగా ఇస్తామని ప్రజా ఆర్ట్స్ తెలియజేసింది.
సెలబ్రిటీలు ఎవరూ లేకుండా షో అంతా సామాన్యులతో రన్ చేస్తామని ప్రజా ఆర్ట్స్ పేర్కొంది. 'ది లక్' గేమ్ షో పోస్టర్ లాంచ్ చేసింది. అయితే... ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేస్తారని, ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రజా ఆర్ట్స్ ప్రతినిధులు తెలిపారు.
Also Read: మనవడిని చూసి మురిసిపోయిన మెగాస్టార్... వరుణ్ తేజ్ కొడుకుతో చిరు ఫోటో!
''మా గేమ్ షోలో పాల్గొనడానికి ప్రత్యేక అర్హతలు గానీ, ప్రతిభ గానీ ఏమీ అవసరం లేదు. మీలో స్థైర్యం ఉంటే చాలు. ఓర్పుగా సులభమైన సవాళ్లు ఎదుర్కొనే వ్యూహం ఉంటే చాలు. కొంచెం కృషి, దృష్టితో పాటు కాస్త అదృష్టం అవసరం. మా షోలో ప్రతి విజేతకు రూ. 10 లక్షల బహుమతి అందిస్తాం. ఇందులో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు. ఉచితంగా పాల్గొనవచ్చు. షోకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఆసక్తి కలవారు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ది లక్ డాట్ వరల్డ్' వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలి'' అని నిర్వాహకులు తెలిపారు.
Also Read: అమెరికాలో 'ఓజీ'కి అన్యాయమా? పవన్ ఫ్యాన్స్ ఫైర్... క్లారిటీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్!
The Luck Game Show Crew: 'ది లక్' గేమ్ షోకి నిర్మాత: ప్రశాంత్, క్రియేటివ్ దర్శకులు: శ్రేయాస్ సిఎం - సూర్య తోరమ్స్ - అపురూప, లీగల్ అడ్వైజర్: సాయి చాతుర్య అరవ, నిర్వాహకులు: మహర్షి నీల - హరిప్రియ మొదలవలస, ఛాయాగ్రహణం: భాను తేజ.