Bellamkonda Sai Sreenivas About Kishkindhapuri Movie: 'రాక్షసుడు 2' కోసం అందరూ అడుగుతున్నారని అయితే దాన్ని మించి 'కిష్కింధపురి' మూవీ ఉంటుందని యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. 

Continues below advertisement

'కిష్కింధపురి' సినిమానే గూస్ బంప్స్

మూవీలో 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే తాను ఫిలిం ఇండస్ట్రీని వదిలేస్తానని చెప్పినట్లు ఓ వార్త రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని... తానెందుకు ఇండస్ట్రీని వదులుతానని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. 'నేను కష్టపడింది ఇక్కడే. ప్రేమించింది ఇక్కడే. బతకాలని అనుకుంటుంది కూడా ఇక్కడే. కట్టె కాలే వరకూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే నా లైఫ్. అసలు థియేటర్‌కు ఫోన్ ఎందుకు?. మూవీ తీయడం వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. చాలామంది సినిమాలో హై, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయని చెప్తుంటారు. మా సినిమానే గూస్ బంప్స్. రాక్షసుడు 2 ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. కానీ దానికి మించిన మూవీ ఇది.' అంటూ చెప్పారు.

Continues below advertisement

తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతుందని... చాలా గర్వంగా ఉందని అన్నారు శ్రీనివాస్. అయితే, ఓ చిన్న వెలితి ఉందని... అది 'కిష్కింధపురి'తో తీరుతుందని చెప్పారు. 'భయపడడం ఓ ఆర్ట్. ఈ మూవీతో అందరినీ భయపెడతాం. ఓ మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ మీకు అందుతుంది.' అని వెల్లడించారు.

Also Read: మనవడిని చూసి మురిసిపోయిన మెగాస్టార్... వరుణ్ తేజ్ కొడుకుతో చిరు ఫోటో!

హారర్ సినిమాల్లో డిఫరెంట్‌గా...

'కిష్కింధపురి' ఇంతకు ముందు హారర్ సినిమాల కంటే పూర్తిగా డిఫరెంట్ అని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. 'ఫస్ట్ అరగంట కామెడీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆడియన్ ఏది ఊహించినా దానికి డిఫరెంట్‌గానే స్టోరీ సాగుతుంది. హారర్, థ్రిల్లింగ్ అంశాలు రెండూ కలగలిపి చాలా కొత్తగా ఉంటుంది. యంగ్ టీంతో 75 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. ఓ కొత్త రకమైన పాత్ర చేసిన ఆనందం కలిగింది.

నాకు విజయాన్నిచ్చిన మూవీ 'రాక్షసుడు'. అయితే అది రీమేక్ కావడంతో కిక్ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా రీమేక్ మూవీస్ చేయాల్సి వచ్చింది.  ఈసారి మాత్రం స్ట్రెయిట్ కథను ఎంచుకుని మూవీ చేశా. నాకు తెలిసి ఇంత కథ ఉన్న హారర్ మూవీ ఇప్పటివరకూ రాలేదేమో.  అందుకే ఇది నాకెంతో స్పెషల్.' అని చెప్పారు.

రాబోయే చిత్రాలివే...

తన భవిష్యత్తు ప్రాజెక్టులపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటికే 'టైసన్ నాయుడు' మూవీ షూటింగ్ పూర్తైందని... 'హైందవ' మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ కానుందని చెప్పారు. 'ఇటీవలే 'మా ఊరి పొలిమేర' దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఓ స్టోరీ చెప్పగా అది బాగా నచ్చింది. ఆయనతో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నా.' అంటూ చెప్పారు.

'కిష్కింధపురి' మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.