రిషి కపూర్... హిందీ సినిమా ఇండస్ట్రీను కొన్నాళ్ళు ఏలిన హీరో. బాలీవుడ్ తొలి తరం హీరో రాజ్ కపూర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా... తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేశారు. ఆయన నటించిన చివరి సినిమా 'శర్మాజీ నమ్ కీన్'. ఈ నెలాఖరున ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిషి కపూర్ మరణించిన 700 రోజులకు ఆయన నటించిన చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 30, 2020లో రిషి తిరిగి రాని లోకాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన మరణించే సమయానికి 'శర్మాజీ నమ్ కీన్' సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆయనపై తీయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వాటిని మరో నటుడు పరేష్ రావల్ తో పూర్తి చేశారు. ఇప్పుడు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.


Also Read: లక్ష్మీ మంచుకూ తప్పని కాస్టింగ్ కౌచ్ - బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై మోహన్ బాబు కుమార్తె లేటెస్ట్ రియాక్షన్


ఈ నెలాఖరున... మార్చి 31న 'శర్మాజీ నమ్ కీన్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. జుహీ చావ్లా, సతీష్ కౌశిక్, పర్మీత్ సేథీ, గరిమా అగర్వాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి హితేష్ భాటియా దర్శకత్వం వహించారు.


Also Read: 'రాధే శ్యామ్'కు రెండోసారి సెన్సార్ ఎందుకు చేశారు? దీని వెనుక రాజమౌళి సలహా ఉందా?