మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఈగల్'. ఈ నెల 9న థియేటర్లలో విడుదలైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే... ఆయన తీసిన యాక్షన్ సీన్లు, ఆ టేకింగ్, సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమా చూడాలని మిస్ అయిన వాళ్లకు, ఓటీటీలో ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్న వాళ్లకు ఓ గుడ్ న్యూస్. 'ఈగల్' ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ అయ్యింది.


ఈటీవీ విన్ యాప్ ఓటీటీలో 'ఈగల్'
Eagle On ETV Win APP: ఈటీవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్' యాప్ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. అతి త్వరలో సినిమాను స్ట్రీమింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.


థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు 'ఈగల్' సినిమా ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. మరి, మార్చి 9న లేదంటే మరొక ఫెస్టివల్ సీజన్ టైంలో ఓటీటీ రిలీజ్ కానుందని టాక్.


Also Read: సుందరం మాస్టర్ రివ్యూ : హర్ష చెముడు సినిమా హిట్టా? ఫట్టా?






'ఈగల్' సినిమా కథ ఏమిటంటే?
'ఈగల్' కథ విషయానికి వస్తే... నళినీ రావు (అనుపమ పరమేశ్వరన్) జర్నలిస్ట్. తలకోన అడవుల్లో కొండలపై పండించే పత్తి, దాంతో తయారైన అరుదైన కాటన్ క్లాత్, ఆ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి సహదేవ వర్మ (రవితేజ) ఆచూకీ ఏడాదిగా ఎవరికీ తెలియదని చిన్న ఆర్టికల్ రాస్తుంది. దాంతో ఏకంగా పేపర్ ఆఫీస్ మీద సీబీఐ దాడులు చేస్తుంది. చివరకు, నళినీ రావు ఉద్యోగం పోతుంది. ఎవరీ సహదేవ వర్మ అని ఆమెలో క్యూరియాసిటీ మొదలవుతుంది. 


తలకోన అడవుల్లో కొండ మీద ఉన్న సహదేవ వర్మను మట్టుబెట్టాలని కేంద్ర ప్రభుత్వ బలగాలు, నక్సల్స్, టెర్రరిస్టులు ఎందుకు వచ్చారు? సహదేవ వర్మ గతం ఏమిటి? గతంలో, వర్తమానంలో అతని అనుచరుడు జై (నవదీప్) పాత్ర ఏమిటి? సహదేవ వర్మ, రచన (కావ్య థాపర్) మధ్య ప్రేమ కథ ఏమిటి? చివరకు, సహదేవ వర్మను ఎవరైనా పట్టుకోగలిగారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Readసిద్ధార్థ రాయ్ రివ్యూ: అర్జున్ రెడ్డి, యానిమల్ టైపులో ఉందా? దర్శకుడు అలా తీశాడా? లేదా? బోల్డ్ సీన్లు ఎలా ఉన్నాయ్?



'ఈగల్'కు సీక్వెల్... 'యుద్ధకాండ'గా పార్ట్ 2
Eagle movie sequel titled Eagle Part 2 Yuddha Kaanda: 'ఈగల్'కు సీక్వెల్ చేయనున్నట్లు థియేటర్లలో విడుదలైన రోజు చెప్పారు. సినిమా చివర్లో సర్‌ప్రైజ్ ఇచ్చారు. పార్ట్ 2 ఉందని చెప్పారు. 'ఈగల్' సీక్వెల్‌కు 'ఈగల్ 2 - యుద్ధకాండ' అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరో రవితేజ పేరు సహదేవ్ వర్మ. అతని ప్రయాణం ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నమాట.


'ఈగల్'ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఇందులో అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మధుబాల తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మణిబాబు డైలాగులు రాశారు. డేవ్ జాండ్ సంగీతం అందించారు.