Siddharth Roy Movie Review - సిద్ధార్థ రాయ్ రివ్యూ: అర్జున్ రెడ్డి, యానిమల్ టైపులో ఉందా? బోల్డ్ సీన్లు ఎలా ఉన్నాయ్?

Siddharth Roy Review In Telugu: ప్రచార చిత్రాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా 'సిద్ధార్థ్ రాయ్'. అర్జున్ రెడ్డి, యానిమల్ టైపులో ఉందా? అసలు, సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూ చూడండి.

Continues below advertisement

Deepak Saroj's Siddharth Roy movie review in Telugu: సిద్ధార్థ్ రాయ్ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల టైపులో ఉంటుందని అనుకున్నారంతా! ఆ రెండిటి కంటే బావుంటుందన్నారు కొందరు. సుమారు వంద మందికి కథ చెప్పానని, అందరికీ నచ్చిందని, కానీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని యశస్వీ చెప్పారు. ఈ కథ, సినిమాలో ఏం ఉంది? బాల నటుడిగా పలు హిట్ సినిమాలు చేసిన దీపక్ సరోజ్ హీరోగా ఎలా చేశారు? హీరోయిన్ తన్వి నేగి ఎలా చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Continues below advertisement

కథ: పన్నెండేళ్లకే ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన కుర్రాడు సిద్ధార్థ్ (దీపక్ సరోజ్). అతనికి ఎమోషన్స్ లేవు... కేవలం అవసరాలు తప్ప! కోరిక కలిగితే దగ్గరలో కనిపించిన అమ్మాయితో మాట్లాడి, ఆమెను ఒప్పించి కోరిక తీర్చుకుంటాడు. క్లాసులో చెబుతున్న పాఠం తనకు తెలిస్తే మధ్యలో వెళ్లిపోతాడు. నిద్ర వస్తే రోడ్డు మీద పడుకుంటాడు. ఆకలి వేస్తే ఆకులు తింటాడు. కేవలం లాజిక్స్ మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్... ఇందు (తన్వి నేగి)కి ఎలా ప్రేమించాడు? ఆమెతో ప్రేమలో ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నాడు? సిద్ధార్థ్ అంటే ప్రేమ ఉన్నా సరే అతడితో ఎందుకు బ్రేకప్ చెప్పింది? తనకు ఇందు కావాలని ప్రతి రోజూ వాళ్లింటికి వెళ్లి గొడవ చేసే సిద్ధార్థ్ చివరికి ఏమయ్యాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: సకల ఐశ్వర్యాలు, రాజ భోగాలు, బంధాలను త్యజించి గౌతమ బుద్ధునిగా మారిన సిద్ధార్థుడి కథ ప్రజలకు తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు విని ఉంటారు. సకల ఐశ్వర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి దూరంగా బతికిన యువకుడు... బంధాల విలువ ఎలా తెలుసుకున్నాడనేది 'సిద్ధార్థ్ రాయ్' కథ. యశస్వీ ఎంపిక చేసుకున్న పాయింట్, చెప్పాలనుకున్న కథ బావుంది. ఐడియా పరంగా చూస్తే కొత్తగా ఉంది. కానీ, తెరపైకి తీసుకురావడంలో తడబడ్డారు.

సినిమాను 'అర్జున్ రెడ్డి', 'యానిమల్', 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' తరహాలో తీయాలని చాలాసార్లు ఓవర్ ది బోర్డు వెళ్లారు. గీత దాటి మరీ మాటలు, సన్నివేశాలు రాశారు. హీరో సిద్ధార్థ్ క్యారెక్టరైజేషన్, అతని సన్నివేశాల విషయానికి వస్తే... విజయ్‌ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా సినిమాల ప్రభావం ఉందని అర్థమవుతోంది. 'ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఫెయిల్ అవుతున్నా' అని ప్రీ క్లైమాక్స్‌లో హీరోకి డైలాగ్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్ చూపించిన సీన్లలో బోల్డ్ ఎక్కువైంది. హీరో రియలైజ్ అయ్యే సీన్లు కొన్ని బాగా తీశారు. ఇక్కడ సమస్య బోల్డ్ సీన్లు కాదు... తాను అనుకున్న రీతిలో సీన్లు తీయడంలో, ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్ చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కానీ, కథను ప్రేక్షకులు అందరికీ అర్థం అయ్యేలా తీయడంలో... కథను బ్యాలన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అవసరమైన దానికంటే నిడివి పెంచుకుంటూ వెళ్లారు. కొన్ని సన్నివేశాలు ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్లు అనినిస్తాయి.

సినిమాలో హీరో ఎన్ని పుస్తకాలు చదివాడు? కథ రాయడానికి, సినిమా తీయడానికి ముందు దర్శకుడు ఎన్ని పుస్తకాలు చదివారు? అనేది ముఖ్యం కాదు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో తీశారా? లేదా? అనేది ముఖ్యం. ప్రీ క్లైమాక్స్‌లో వివిధ పుస్తకాల్లో కోట్స్ గురించి మాథ్యూ వర్గీస్ చెబుతుంటే ప్రేక్షకుడికి అర్థం చేసుకునే టైమ్, గ్యాప్ ఉండవు. పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుండాల్సింది. కథ అవసరం మేరకు నిర్మాణ విలువలు ఉన్నాయి.

Also Read: భ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్ - లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

బాధ, సంతోషం, కోపం... ఏదైనా ఎక్స్‌ట్రీమ్ లెవల్‌లో చూపించడం హీరో సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టరైజేషన్. దీపక్ సరోజ్ తన వయసుకు, రూపానికి మించిన క్యారెక్టర్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అనుభవం ఉండటంతో ఎమోషనల్ సీన్లు బాగా చేశారు. ఆ గడ్డం, పెరిగిన జుట్టు లుక్ సెట్ కాలేదు. హీరోయిన్ తన్వి నేగి బోల్డ్ సీన్లు ధైర్యంగా చేశారు. నటనలో ఇంకా ఓనమాలు దగ్గర ఆగారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

'సిద్ధార్థ్ రాయ్' టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేశాయి. సినిమా ఆ స్థాయిలో లేదు. 'మితిమీరిన స్పందనలకు తల వంచకు... లొంగకు' అని ఓ పాటలో సాహిత్యం వినబడుతుంది. దర్శకుడు యశస్వీ మితిమీరిన స్పందనలకు తల వంచారు. దాంతో బండి బ్యాలెన్స్ తప్పింది. ఆయన చెప్పాలనుకున్న ఎమోషన్ కంటే బోల్డ్ సీన్లు హైలైట్ అయ్యాయి. జస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఆ సీన్లు మెప్పిస్తాయంతే! సినిమా డిజప్పాయింట్ చేస్తుంది.

Also Read: భామాకలాపం 2 రివ్యూ: ప్రియమణి బ్లాక్‌బస్టర్ ఓటీటీ సీక్వెల్ ఎలా ఉంది? ఇది కూడా సూపర్ హిట్టేనా?

Continues below advertisement
Sponsored Links by Taboola