Baahubali : Crown of Blood & RRR & Rajamouli: ‘బాహుబ‌లి’ మూవీ యానిమేటేడ్ వెర్ష‌న్ 'బాహుబలి: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్'‌ సీరిస్‌ను ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ సినిమాతో తనకు ఉన్న బంధాన్ని ఆయన పంచుకున్నారు.


బాహుబలి మూవీ ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉందని రాజమౌళి అన్నారు. ‘బాహుబలి’ మూవీ కోసం కథను సిద్ధం చేస్తున్నప్పుడు క్యారెక్టర్లను రూపొందించేప్పుడు.. ఆ యూనివర్శ్‌లో ప్రేక్షకులకు చెప్పేందుకు ఇంకా కథ ఉందని అనిపించిందని తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో ఒక సినిమా విజయవంతమైతే.. ఆ బ్రాండ్ అనేక మీడియమ్స్‌లో ముందుకు వెళ్తుందని, ఇక్కడ మాత్రం అలా జరగడం లేదన్నారు. సినిమా విజయవంతమైతే అక్కడితోనే అయిపోతుంది. కానీ, ఆ విజయాన్ని కొనసాగించాలని చాలా విధాలుగా ప్రయత్నించామన్నారు. దాని ఫలితమే 'బాహుబలి: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్' అని పేర్కొన్నారు. 



ఐదేళ్ల త‌ర్వాత యానిమేటెడ్ వెర్ష‌న్.. 


'బాహుబలి: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్'‌ పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. యానిమేటెడ్ సిరీస్‌గా 'బాహుబలి'ని తీసుకురాబోతున్నారు. ఈ కొత్త సిరీస్‌ ద్వారా సినిమాలో చూపించిన కథకు ముందు ఏం జరిగిందనేది చూపించబోతున్నార‌నే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఆ ట్రైల‌ర్ లో చాలా కొత్త విష‌యాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లోనే కట్టప్ప విలన్‌ అని తెలుస్తోంది.


మే 17న హాట్ స్టార్‌లో  'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' రిలీజ్ కానుంది. బాహుబలికి రాజమౌళి దర్శకుడు కాగా, ఈ యూనిమేటెడ్‌ సిరీస్‌ను ఆయన నిర్మాతగా ఉన్నారు. రాజమౌళి, దేవరాజన్ సృష్టించగా ఈ కథకు జీవన్ J. కాంగ్‌, నవీన్ జాన్‌లు దర్శకత్వం వహించారు. శోభుయార్లగడ్డతో కలిసి జక్కన్న, దేవరాజన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ ప్రెస్ మీట్‌లో రాజమౌళికి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మూవీపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, జక్కన్న ఇది సందర్భంగా కాదని సమాధానం ఇచ్చారు.


Also read: వామ్మో, ఇషా అంబానీ డ్రెస్ తయారీకి.. పదివేల గంటల టైమ్ పట్టిందా? ఎందుకంత స్పెషల్?