మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) సరికొత్త సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే... ఆవిడ వచ్చేది థియేటర్లలోకి కాదు, ఓటీటీలోకి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రఘు తాత' (Raghu Thatha Movie). మరి ఏ ఓటీటీలో, ఎప్పుడు ఈ సినిమా వస్తుందో తెలుసా?


జీ 5 ఓటీటీలో 'రఘు తాత' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Raghu Thatha streaming on Zee5: 'రఘు తాత' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించారు. ఆగస్టు 15న అక్కడ థియేటర్లలో విడుదల అయ్యింది. నాలుగు వారాలకు ఓటీటీలోకి ఈ సినిమా వస్తోంది.


తమిళనాట థియేటర్లలో విడుదలైన 'రఘు తాత'... ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో వీక్షకులకు అందుబాటులోకి రానుంది. గురువారం మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


Also Read: అవును... మేం విడిపోయాం - ఆర్తితో విడాకులు కన్ఫర్మ్ చేసిన హీరో జయం రవి





కీర్తితో 'కెజిఎఫ్' నిర్మాతలు తీసిన సినిమా
'రఘు తాత' సినిమాను 'కెజిఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి పాన్ ఇండియా ఫిలిమ్స్ తీసిన హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రానికి విజయ్ కిరగందూర్ నిర్మాత. సుమన్ కుమార్ దర్శకుడు. తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.


Also Readముంబైలో ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా మీటింగ్ - 'దేవర'తో 'యానిమల్' దర్శకుడు సినిమా తీస్తే....


రఘు తాత... నాకు ఒక సవాలు!
'రఘు తాత' సినిమా గురించి కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ... ''నమ్మిన దాని కోసం చాలా ధైర్యంగా నిలబడే ధైర్యశాలి పాత్రను చేయడం సంతోషంగా ఉంది. 'రఘు తాత' పాత్రలో నటించడం నాకు ఓ సవాలుగా అనిపించింది. తెలుగులో 'జీ 5'లో ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.


Also Read: దుల్కర్ సల్మాన్ చేతికి కిరణ్ అబ్బవరం సినిమా - కేరళలో 'క' గ్రాండ్ రిలీజ్ గ్యారంటీ



హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ... ''ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్. భావోద్వేగ భరితంగా సాగుతుంది. 'రఘు తాత' మాకు ఓ స్పెషల్ ప్రాజెక్ట్. సామాజిక సమస్యలు ప్రస్తావిస్తూ వినోదాత్మకంగా సాగుతుంది'' అని చెప్పారు. దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ... ''నా జీవితంలో ఓ మరుపురాని ప్రయాణం 'రఘు తాత'. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు. కీర్తీ సురేష్ ప్రజెంట్ చేస్తున్న సినిమాలకు వస్తే... హిందీలో 'బేబీ జాన్', తమిళంలో 'రివాల్వర్ రీటా' చేస్తున్నారు.