మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ముంబైలో ఉన్నారు. మంగళవారం (సెప్టెంబర్ 10న) 'దేవర' ట్రైలర్ విడుదల కానుంది. అందుకు ఆయన బాంబే వెళ్లారు. అయితే, అక్కడ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)ను ఆయన సమావేశం కావడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.


సందీప్ రెడ్డిని ఎన్టీఆర్ ఎందుకు కలిశారు?
ఇప్పుడు ముంబై సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకుల్లో ఒక్కటే సందేహం... సందీప్ రెడ్డి వంగాను ఎన్టీఆర్ ఎందుకు కలిశారు? అని! వీళ్లిద్దరూ కలిసి ఏదైనా సినిమా చేస్తారా? కథ గురించి డిస్కషన్స్ ఏమైనా చేశారా? అని! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందట.


'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో జనాలు మెచ్చిన 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ కూడా ఓటు వేసింది. అవార్డును ఇచ్చింది. ఆ పాటలో డ్యాన్స్ మాత్రమే కాదు... ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన సైతం అందర్నీ మెప్పించింది. పవర్ హౌస్ టాలెంట్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దాంతో ఆయన చేయబోయే సినిమాలపై పాన్ ఇండియా, ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూపు ఉంది.






Jr NTR Upcoming Movies: ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేశారు ఎన్టీఆర్. దీని తర్వాత హిందీ హీరో హృతిక్ రోషన్ 'వార్ 2'లో మరో హీరోగా నటిస్తున్నారు. ఆ తర్వాత 'కెజిఎఫ్', 'సలార్' సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేయనున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.


''ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా క్యాజువల్‌గా కలిశారు. అప్ కమింగ్ మూవీస్, కలిసి సినిమా చేసే అవకాశం గురించి డిస్కస్ చేసుకున్నారు. వాళ్లిద్దరికీ... ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. సంథింగ్ స్పెషల్ స్టోరీతో భారీ సినిమా చేసే అవకాశం ఉంది'' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.


Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'



Sandeep Reddy Vanga Upcoming Movies: సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమైన 'అర్జున్ రెడ్డి' తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 'కబీర్ సింగ్', రణ్‌బీర్ కపూర్ హీరోగా తీసిన 'యానిమల్' సినిమాలతో హిందీలోనూ భారీ విజయాలు అందుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చేయడానికి సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు. 'యానిమల్' సీక్వెల్ 'యానిమల్ పార్క్' కూడా అనౌన్స్ చేశారు. ఆ రెండు సినిమాల తర్వాత ఆయన ఫ్రీ అవుతారు. అప్పటికి ఎన్టీఆర్ కమిట్మెంట్స్ కంప్లీట్ అయితే ఇద్దరు కలిసి సినిమా చేయడానికి వీలు అవుతుంది.


Also Readనయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!