Hanu Man OTT Release New Update: ఎలాంటి అంచ‌నాలు లేవు, అతి త‌క్కువ స్క్రీన్ లు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా త‌క్కువ స్క్రీన్ లు కేటాయించారు. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ‌య్యే సంక్రాంతి టైంలో బ‌రిలోకి దిగింది 'హ‌నుమాన్' సినిమా. కానీ, అంచ‌నాల‌ను తారుమారు చేసింది. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. రికార్డులు మీద రికార్డులు సృష్టించింది. క‌లెక్ష‌న్ల సునామీ కొన‌సాగించింది. జ‌న‌వ‌రి 12న రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ఆడుతూనే ఉంది. ప్రేక్ష‌కుల‌ను సినిమా హాళ్ల‌కు క్యూ క‌ట్టేలా చేస్తుంది. ఇక థియేట‌ర్ లో ఈ సినిమాని ఎక్స్ పీరియెన్స్ చేసిన వాళ్లు సైతం.. ఓటీటీలో మ‌రోసారి చూసేందుకు ఎదురుచూస్తున్నారు. అలాంటి వాళ్లకు అదిరిపోయే న్యూస్ ఇది. హ‌నుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింద‌నే వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. 


ఓటీటీలోకి ఎప్పుడంటే? 


'హ‌నుమాన్' సినిమా ఓటీటీ రైట్స్ జీ - 5 ఫ్లాట్ ఫామ్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమాని మార్చి 2న రిలీజ్ చేయ‌నున్నార‌నే వార్త‌ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. సినిమా రీలీజైన 50 రోజుల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే ఒప్పందం జ‌రిగిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ కాగా.. ఇక మార్చి 2న ఓటీటీలో రిలీజ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త తెలిసిన వాళ్లంతా.. ''హ‌మ్మ‌య్యా వెయిటింగ్ ఈజ్ ఓవ‌ర్'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ZEE5 'హనుమాన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కి నెల రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ అప్ప‌టికి థియేటర్స్ వద్ద హనుమాన్ దూకుడు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా వేసి ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 


రికార్డులు మీద రికార్డులు.. 


తేజ స‌జ్జ హీరోగా, ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్ లో సంక్రాంతికి బ‌రిలో నిలిచిన సినిమాల్లో 'హ‌నుమాన్' సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టికే దాదాపు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. సినిమా రిలీజై దాదాపు 50 రోజులు కావొస్తున్నా ఇంకా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తూనే ఉంది. అలా నార్త్ లో రిలీజైన ఈ సినిమా.. స‌రికొత్త రికార్డు సృష్టించింది. రూ.50 కోట్లు సాధించిన అతి త‌క్కువ సినిమాల జాబితాలోకి చేరిపోయింది హ‌నుమాన్. ఇప్పటివరకు 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'పుష్ప', 'RRR', 'రోబో 2', 'కాంతార', 'KGF 2' సినిమాలు మాత్రమే ఈ రికార్డుని సాధించాయి. ఇక ఇప్పుడు ఆ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు తేజ సజ్జ. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రజినీకాంత్, యశ్, రిషబ్ శెట్టి తర్వాత తేజ సజ్జ నార్త్ లో రూ.50 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హీరోగా రికార్డ్ సృష్టించాడు.  మ‌న దేశంలోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో కూడా స‌త్తా చాటింది ఈ సినిమా.


Also Read: ఫ్రాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తాచాటిన సాయి తేజ్, స్వాతిల 'సత్య' సాంగ్‌ - ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 అవార్డులు