Best Rom Com Movies On OTT: ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తెరకెక్కించగలిగితే అవి కచ్చితంగా సూపర్ హిట్స్ అందుకుంటాయి. ఎన్నో ఏళ్ల నుండి ఈ జోనర్‌లో చిత్రాలు చాలావరకు సక్సెస్‌ను అందుకుంటున్నాయి. ఇతర జోనర్లలో సినిమాలు ఇష్టపడినా.. రిఫ్రెష్ అవ్వాలంటి ఒక రామ్ కామ్ చూడాల్సిందే. ఒటీటీల్లో అలాంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి ‘పొన్ ఒండ్రు కండేన్‘ (Pon Ondru Kanden). ఈ తమిళ మూవీ కొన్నాళ్ల క్రితమే ఓటీటీలో విడుదలయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది.


కథ..


‘పొన్ ఒండ్రు కండేన్’ కథ విషయానికొస్తే.. గైనకాలజిస్ట్‌ శివగా అశోక్ సెల్వన్, స్టార్ హోటల్‌లో చెఫ్‌ సాండీగా ఐశ్వర్య లక్ష్మి ఇంట్రడక్షన్ జరుగుతుంది. అసలైతే సాండీ పేరు సుందరి. కానీ తనకు ఆ పేరు నచ్చకపోవడంతో సాండీ అని మార్చేసుకుంటుంది. సినిమాలో ఈ సుందరి పేరు వెనుక కూడా చాలా పెద్ద కథే ఉంటుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో సాయి (వసంత్ రవి). తన తల్లికి ఆరోగ్యం బాగుండకపోవడంతో ఏ ఉద్యోగం చేయకుండా తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. శివకు పెళ్లి చేయాలని తన ముగ్గురు అక్కలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ తనకు మాత్రం పెళ్లి ఇష్టముండదు. ఇక సాండీ విషయానికొస్తే.. తనకు ఫారిన్‌లోని స్టార్ హోటల్‌లో చెఫ్‌గా అవకాశం వస్తుంది. కానీ అక్కడ వెళ్లి జాయిన్ అవ్వడానికి ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు చెన్నైలోని మరో హోటల్‌గా చీఫ్ చెఫ్‌గా పనిచేయడానికి వెళ్తుంది.


ఒకరోజు శివ, సాయిలకు తమ స్కూల్ ఫ్రెండ్స్ నుండి ఫోన్ వస్తుంది. స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ అంటూ వారిద్దరినీ ఆహ్వానిస్తారు. శివ, సాయి ఇద్దరూ ఒకే స్కూల్, ఒకే క్లాస్. కానీ ఒక అమ్మాయి వల్ల వారిద్దరూ గొడవపడి శత్రువుల్లాగా మారిపోతారు. అప్పటినుండి ఒకరినొకరు శత్రువుల్లాగానే భావిస్తారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్‌లోనే కలుసుకుంటారు. అదే సమయంలో సాయి తల్లికి బాగోలేదని తనకు ఫోన్ వస్తుంది. అతడి తల్లిని కాపాడుకోవడానికి శివ సాయం చేస్తాడు. దీంతో వాళ్లిద్దరూ మళ్లీ ఫ్రెండ్స్ అవుతారు. తన తల్లికి మంచి వైద్యం అందాలంటే చెన్నైకు రమ్మని చెప్తాడు. కొన్నాళ్లకు సాయికి కూడా అదే కరెక్ట్ అనిపించి చెన్నై వెళ్తాడు. అక్కడ సాయికి కావాల్సిన ఏర్పాట్లన్నీ శివనే చూసుకుంటాడు.


చెన్నైలో సాయి ఉండే అపార్ట్మెంట్స్‌లోనే సాండీ చేరుతుంది. శివ చెప్పే ఐడియాలతో సాండీకి దగ్గరవుతాడు సాయి. తనతో పాటు తన తల్లితో కూడా బాగా కలిసిపోతుంది సాండీ. సాయిపై తనకు కూడా ఇష్టం ఏర్పడుతుంది. అలా ఒకరోజు సాండీని శివకు పరిచయం చేద్దామనుకుంటాడు సాయి. షాపింగ్ మాల్‌లో సాయి, సాండీని కలిసి చూడగానే శివ పారిపోతాడు. ఎందుకంటే కొన్నేళ్ల క్రితమే శివ, సాండీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటారు. ఆ విషయం కొన్నాళ్లకే సాయికి కూడా తెలిసిపోతుంది. కానీ శివ, సాయి ముందు నుండే ఫ్రెండ్స్ అని సాండీకి తెలియకుండా మ్యానేజ్ చేస్తారు. చివరికి ఏం జరుగుతుంది? శివను మర్చిపోలేక మళ్లీ సాండీ తనతోనే లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటుందా? సాయిపై ఇష్టాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తుందా? అనేది తెరపై చూడాల్సిన కథ.



క్యారెక్టరైజేషన్స్ సూపర్..


ఎక్కువగా లాజిక్స్ వెతుక్కోకుండా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చూడాలనుకునేవారికి ‘పొన్ ఒండ్రు కండేన్’ పర్ఫెక్ట్. సినిమా అంతా మంచి మ్యూజిక్‌తో, మూడు క్యారెక్టర్లు బ్యాలెన్స్ అవుతూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా పాత్రలు డిజైన్ చేసే విషయంలో దర్శకురాలు వి ప్రియా సక్సెస్ అయ్యారు. కానీ ‘పొన్ ఒండ్రు కండేన్’లో మైనస్‌గా నిలిచే అంశం క్లైమాక్స్. సినిమా అంతా సాఫీగా సాగినా క్లైమాక్స్‌ మాత్రం గందరగోళంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అయినా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ మాత్రం మిస్ అవ్వదు. మీరు కూడా ఈ సినిమాను చూడాలనుకుంటే ‘జియో సినిమా’లో స్ట్రీమ్ చేయవచ్చు.


Also Read: ఆ జంటను వెంటాడే గతం - వారిని చంపాలనుకునే పోలీస్, థ్రిల్లింగ్‌గా సాగే రివెంజ్ డ్రామా ఇది