Polimera 2 Movie: ఈ ఏడాది విడుదలయిన ఎన్నో తక్కువ బడ్జెట్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని సృష్టించాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘పొలిమేర 2’. రెండేళ్ల క్రితం విడుదలయిన ‘పొలిమేర’కు ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే ‘పొలిమేర’ కూడా అప్పట్లో ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని కంటెస్టెంట్ చూసి ప్రేక్షకులంతా షాక్ అయ్యేలా చేశాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. అందుకే ‘పొలిమేర’కు సీక్వెల్ ఉంటుంది అని తెలియగానే చాలామంది ప్రేక్షకులు.. ఈ సీక్వెల్ కోసం ఎదురుచూశారు. ఇక ఈ సీక్వెల్ కూడా ఆడియన్స్‌ను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా హిట్ కొట్టింది. త్వరలోనే ఓటీటీలో కూడా విడుదలయ్యి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించనుంది ‘పొలిమేర 2’.


‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు సిద్ధం..
నవంబర్ 3న ‘పొలిమేర 2’ థియేటర్లలో విడుదయ్యింది. ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కరాల, బాలాదిత్య, గెటప్ శ్రీను ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతుండడంతో ఓటీటీ రిలీజ్ వివరాలను బయటపెట్టింది మూవీ టీమ్. ‘ఆహా’ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమ్ కానున్నట్టు బయటపెట్టింది. ఊహించని ట్విస్టులతో థియేటర్లలో అందరినీ ఆశ్చర్యపరిచిన ‘పొలిమేర 2’.. ఓటీటీలో చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు కూడా థ్రిల్ ఇవ్వడానికి వచ్చేస్తోంది.


ఓటీటీ ప్రేక్షకుల ఎదురుచూపు..
‘రా ఇటుగ రా పిడుగులా.. డిసెంబర్ 8న ఊహించని ట్విస్టులతో మతిపోగొట్టే బ్లాక్‌బస్టర్ పొలిమేర 2 వచ్చేస్తోంది’ అంటూ ఆహా టీమ్.. తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యి ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చేతబడిలాంటి రూరల్ కాన్సెప్ట్‌తో వచ్చి.. అలాంటి కథతో హిట్ కొట్టవచ్చని అందరికీ నిరూపించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. అయితే ఈ సినిమాకు ఈ రెండు పార్ట్స్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని, సంవత్సరానికి ఒక పార్ట్‌ను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నానని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు. ప్రతీ పార్ట్‌లో ట్విస్టులు పెరిగిపోతూనే ఉంటాయని హామీ ఇచ్చాడు.






సక్సెస్ ఫార్ములా..
ఇక చేతబడి కాన్సెప్ట్ అనేది ఈమధ్య టాలీవుడ్‌లో బాగా ఫేమస్ అయిపోతోంది. ఒకప్పుడు ఇలాంటి కథలతో ఎప్పుడో కానీ ఒక సినిమా వచ్చేది కాదు. కానీ ఈ ఏడాదిలోనే ఇలాంటి కాన్సెప్ట్‌లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా హిట్‌ను కూడా సాధించాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ కూడా చేతబడి కథాంశంతో తెరకెక్కిందే. ఇక తాజాగా పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ చేసిన ‘మంగళవారం’లో కూడా చేతబడి గురించే చూపించి భయపెట్టాడు దర్శకుడు. దీంతో టాలీవుడ్‌లో ఈ కాన్సెప్ట్ అనేది ఒక సక్సెస్ ఫార్ములాలాగా మారిపోయింది. దర్శకుడు కూడా దీనిని సక్సెస్ ఫార్ములాలాగా భావిస్తే.. ఇదే కాన్సెప్ట్‌తో మరిన్ని చిత్రాలు తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.


Also Read: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్ - కారణం అదేనా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply