Peddi Streaming Date Netflix: రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళు సాధించింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అవుతోంది. 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోండి. 

Continues below advertisement

జూలై 9 నుంచి 'పెద్ది' స్ట్రీమింగ్... ట్విస్ట్ ఏమిటంటే?Peddi Netflix Release Date: 'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పాపులర్ ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆటకూలిగా క్రికెట్ ఆడే ఓ యువకుడు, తమ ఊరికి రైల్వే స్టేషన్ వచ్చేలా చేయడం కోసం ఏం చేశాడు? ఉత్తరాంధ్రలో మారుమూల పల్లె నుంచి ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళాడు? అనేది కథ.

Also Read: Alpha Collections Day 1 - హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిందా? అసలు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?

Continues below advertisement

జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'పెద్ది' స్ట్రీమింగ్ కానుంది. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. 'పెద్ది'ని పాన్ ఇండియా రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు మిగతా మూడు సౌత్ ఇండియన్ లాంగ్వేజీలు కన్నడ, మలయాళం, తమిళంలో మాత్రమే కాకుండా... హిందీలోనూ సినిమా విడుదలైంది. జూలై 9న హిందీ కాకుండా మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టులో వీక్షకులకు అందుబాటులోకి రానుంది.

Also ReadRao Bahadur First Day Collections - ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

రామ్ చరణ్ జంటగా జాన్వీ... పాటలు సూపర్!'పెద్ది'లో రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ప్రత్యేక గీతంలో శృతి హాసన్ సందడి చేశారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌ కుమార్, బాలీవుడ్ యాక్టర్లు బోమన్ ఇరానీ, దివ్యేందు, టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.

ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఆయన పాటలు సినిమా విడుదలకు ముందు చార్ట్ బూస్టర్లు అయ్యాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రేటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేశారు.

Also ReadNagabandham First Day Collections - నాగబంధం కలెక్షన్లు... ఫ్లాప్‌ టాక్‌తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?