Satyadev's Rao Bahadur Opening Day Box Office Collection: సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రావు బహదూర్'. జూలై 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మొదటి రోజు బాక్సాఫీస్ బరిలో మంచి ఆరంభాన్ని అందుకుంది. యువ దర్శకుడు, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సైకలాజికల్ డ్రామా, మర్డర్ మిస్టరీ సినిమాకు ఓవర్సీస్ నుంచి మంచి ఓపెనింగ్ లభించింది. మరి ఇండియాలో? ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? వంటి వివరాలు తెలుసుకోండి.

Continues below advertisement

నాగబంధం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?Nagabandham First Day Collection Worldwide: ఇండియాలో కంటే విదేశాల్లో 'రావు బహదూర్'కు మొదటి రోజు మంచి వసూళ్ళు వచ్చాయి. విమర్శకుల నుంచి సినిమాకు ప్రశంసలు రావడం హెల్ప్ అయ్యింది. 'రావు బహదూర్' రివ్యూలలో ఇది కమర్షియల్ సినిమా కాదని, కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని పేర్కొనడం కూడా ప్లస్ అయ్యింది. మొదటి రోజు వసూళ్ళ వివరాలు చూస్తే...

  • 'రావు బహదూర్' సినిమాకు మొదటి రోజు ఇండియాలో రూ. 1.40 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
  • కర్ణాటకలో 13 లక్షలు, తమిళనాడు (చెన్నై)లో రెండు లక్షలు, రెస్టాఫ్ ఇండియా నుంచి మరో లక్ష గ్రాస్ వచ్చింది. దాంతో ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 1.61 కోట్లకు చేరాయి.
  • ఓవర్సీస్ మార్కెట్‌లో (Overseas) మొదటి రోజు రూ. 1.50 కోట్ల గ్రాస్ వచ్చింది.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'రావు బహదూర్' టోటల్ గ్రాస్ రూ. 3.11 కోట్లు.

Also Read: Nagabandham First Day Collections - నాగబంధం కలెక్షన్లు... ఫ్లాప్‌ టాక్‌తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Continues below advertisement

హైదరాబాద్ సిటీ కలెక్షన్స్ ఎక్కువ!'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' తర్వాత సత్యదేవ్, వెంకటేష్ మహా కలిసి చేసిన సినిమా 'రావు బహదూర్'. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన రూ. 1.40 నెట్ కలెక్షన్లలో సగం కలెక్షన్స్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చాయి. 

హైదరాబాద్ సిటీలో 'రావు బహదూర్' సినిమాకు మొదటి రోజు 70.82 లక్షల గ్రాస్ వచ్చింది. మొదటి రోజు ఏవరేజ్ ఆక్యుపెన్సీ చూస్తే... 27.65 శాతం. మార్నింగ్ షోలకు 19 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా... నైట్ షోలకు 38.08 శాతం ఆక్యుపెన్సీ ఉండటం గమనార్హం.

Also ReadSuper Subbu Series Review And Rating - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో 'రావు బహదూర్' తెరకెక్కింది. చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. సత్యదేవ్‌ సరసన దీపా థామస్ నటించిన 'రావు బహదూర్' సినిమాలో వికాస్ ముప్పాల, ఆనంద్ భారతి, బాల పరాశర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతాన్ని, కార్తీక్ పర్మార్ ఛాయాగ్రహణాన్ని అందించారు. 

Also ReadGurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: పెళ్ళికి ముందు కుర్రాడు గజనీ అయితే? ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?