Nagabandham Opening Day Box Office Collections: యువ కథానాయకుడు విరాట్ కర్ణ, దర్శకుడిగా మారిన అభిషేక్ నామా కలయికలో రూపొందిన మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'నాగబంధం: ద సీక్రెట్ ట్రెజర్'. మొదటి రోజు క్రిటిక్స్, కామన్ ఆడియన్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే... బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఇవెనింగ్ సాధించింది. ఫస్ట్ డే సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Continues below advertisement

నాగబంధం ఫస్ట్ డే @ 3.75 కోట్లు!'నాగబంధం' సినిమా జూలై 3న విడుదల అయ్యింది. మైథలాజికల్ ఫిల్మ్ కావడం వల్ల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి రోజు కనిపించింది. దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చాయి.

  • 'నాగబంధం' సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 3,202 షోలు ప్రదర్శించారు.
  • ఇండియాలో మొదటి రోజు రూ. 3.75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
  • తెలుగులో మొదటి రోజు రూ. 2.90 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో రూ. 20 లక్షలు, తమిళంలో రూ. 10 లక్షలు, మలయాళంలో రూ. 3 లక్షలు, కన్నడలో రూ. 2 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
  • ఇండియాలో ఫస్ట్ డే టోటల్ నెట్ కలెక్షన్స్ రూ. 3.25 కోట్లు. 

Also ReadRao Bahadur Review And Rating - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎలా ఉంది?'నాగబంధం' థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే... తెలుగు వెర్షన్ 24.87 శాతం ఆక్యుపెన్సీతో మిగతా భాషల కంటే ముందు వరుసలో నిలిచింది. నైట్ షోలకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చారు. దాంతో సెకండ్ షోస్ 31.92 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. హైదరాబాద్, వరంగల్, గుంటూరు వంటి ప్రాంతాల్లో కలెక్షన్స్ బావున్నాయి.

Also ReadSuper Subbu Series Review And Rating - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?

'నాగబంధం' సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, మురళీ శర్మ, జగపతి బాబు, అనుసూయ భరద్వాజ్, సోనియా సింగ్, రిషబ్ సాహ్ని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పురాతన రహస్యాలు, బ్రహ్మ కమలం అన్వేషణ నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఇందులో రుద్ర, శివ... రెండు పాత్రల్లో విరాట్ కర్ణ మెప్పించారు. 'నాగబంధం' రివ్యూలలో విజువల్ ఎఫెక్ట్స్, రన్ టైమ్, సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ... గ్రాండియర్, ప్రొడక్షన్ డిజైన్ ప్రశంసలు అందుకుంటున్నాయి.

Also ReadGurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: పెళ్ళికి ముందు కుర్రాడు గజనీ అయితే? ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?