Samantha's Maa Inti Bangaaram Deleted Scenes Bloopers : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మా ఇంటి బంగారం'. దాదాపు రెండేళ్ల తర్వాత సమంత యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ... మూవీ డిలీటెడ్ సీన్స్ వీడియో రిలీజ్ చేశారు.

Continues below advertisement

నవ్వులే నవ్వులు

ఎక్కువగా సమంత, ఆమె ఫ్రెండ్ కిరణ్మయి (మంజూష) మధ్య జరిగే సరదా సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్‌లో సమంత అల్లరి, ఫ్యామిలీతో ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను షేర్ చేశారు. శ్రీముఖి, సమంతతో పాటు ఫ్యామిలీతో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ షూటింగ్, సరదా సంభాషణలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 2 నిమిషాల 16 సెకన్స్ ఉన్న వీడియో నవ్వులు పూయిస్తోంది.

Continues below advertisement

Also Read : Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ

ఈ మూవీకి సమంత ఫ్రెండ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, మంజూష, ఆనంద్, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత భర్త రాజ్ నిడిమోరు స్టోరీ అందించగా... సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.

జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దాదాపు వరల్డ్ వైడ్ రూ.83 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ అంతే స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటివరకూ 1.9 మిలియన్ డాలర్స్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read : Rao Bahadur Review - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.