Horror Thriller Web Series Veerabhadruni Rahasyam OTT Streaming : 90s ఫేమస్ సీరియల్ 'మర్మదేశం' వరల్డ్ నుంచి వచ్చిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'వీరభద్రుని రహస్యం'. ఇప్పటి జనరేషన్‌కు అప్పటి తరాన్ని భయపెట్టిన కథను మరింత థ్రిల్లింగ్‌గా చూపించేలా ఈ సిరీస్ రూపొందించారు. శుక్రవారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.
అసలెందుకు చూడాలి?
ప్రముఖ ఓటీటీ ZEE5లో 'వీరభద్రుని రహస్యం' శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 60 ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ అందుబాటులోకి రానుండగా... ప్రతీ వారం కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సిరీస్‌కు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించగా... వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందగా రఘుకుంచె, కార్తికేయగా రఘు, ఎస్సై అభినవ్‌గా రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష, అనురాధ, బాలచంద్ర, కల్కి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
స్టోరీ ఏంటంటే?
90sలో బుల్లితెరపై వచ్చిన 'మర్మదేశం' సీరియల్ చాలా ఫేమస్. ఊరిలో ఉండే వీరభద్రుని గుడి, గ్రామస్థుల మూఢ నమ్మకాలు, ఇవేవీ కాదని సైన్స్‌ను నమ్మే అమ్మాయి... ఊరిలో జరిగే విపరీతాలకు వీరభద్రుడే కారణమని భావించి జాగ్రత్తగా ఉండాలని భ్రమ పడే గ్రామస్థులు... అసలు రహస్యాన్ని ఛేదించే పట్టణానికి చెందిన యువతి. ఇదీ షార్ట్‌గా మర్మదేశం స్టోరీ. అప్పటి జనరేషన్‌కు భయం కలిగించి సూపర్ థ్రిల్ పంచింది ఈ సీరియల్.
ఇప్పుడు అదే థ్రిల్ మరింత పెంచేలా ఇప్పటి జనరేషన్‌కు అప్పటి తరం భయాన్ని పరిచయం చేసేలా రూపొందించిన సిరీస్ వీరభద్రుని రహస్యం. వీరభద్రపురం అనే ఊరిలో చెట్టు కింద ఉంటుంది వీరభద్రుని గుడి. గ్రామ పెద్దతో పాటు గ్రామస్థులంతా తమ కుల దైవంగా ఆయన్ను నిత్యం కొలుస్తుంటారు. ఊరిలో ఎవరైనా తప్పు చేసినా వీరభద్రుడే స్వయంగా శిక్షిస్తాడని నమ్ముతారు గ్రామస్థులు. ముఖ్యంగా ఊరిలో గంట మోగితే తప్పు చేసిన వాడి చావు తథ్యం అని అక్కడి వారి నమ్మకం.
ఊరంతా దీన్ని నమ్మినా... పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి నమ్మదు. అసలు ఊరిలో జరిగే హత్యల వెనుక ఏదో బలమైన కారణం ఉందని నమ్ముతుంది. తనదైన శైలిలో విచారణ మొదలుపెడుతుంది. అసలు ఊరిలో తప్పు చేసిన వారిని వీరభద్రుని పేరిట చంపుతుంది ఎవరు? ఊరిలో చావులకు వీరభద్రుడే కారణమా? వీరభద్రపురం రహస్యం ఏంటి? ఊరి పెద్ద కుటుంబానికి వీరభద్రుని గుడికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : Nagabandham OTT: నాగబంధం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్... విరాట్ కర్ణ శివతాండవం స్ట్రీమింగ్ అయ్యేది ఎందులోనంటే?
