థియేటర్లలో ఈ వారం విడుదలయ్యే పెద్ద సినిమాలు ఏవి లేవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వాయిదా పడడంతో జూన్ 12వ తేదీ స్లాట్ ఖాళీ అయింది. జూన్ 13న తమిళ డబ్బింగ్ పాప తెలుగులో విడుదలకు రెడీ అయింది. పవన్ సినిమా ఉండడంతో వేరే సినిమాలు జూన్ రెండో వారం తమ సినిమా విడుదల చేయాలని అనుకోలేదు. ఇప్పటికిప్పుడు పబ్లిసిటీ చేసి వేరే సినిమాలో విడుదల చేసే పరిస్థితి లేదు. మరి ఈ వారం ఓటీడీలో ఏ ఏ సినిమాలో వస్తున్నాయో తెలుసా?

Continues below advertisement


జూన్ 10న ఓటీటీలోకి వచ్చే సినిమాలు, సిరీస్‌లు



  • జియో హాట్ స్టార్ ఓటీటీలోకి మలయాళ సినిమా 'పడక్కలం' (Padakkalam) రిలీజ్ అవుతోంది. మిగతా భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది.

  • నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్ 'ట్రైన్ రెక్' (TrainWreck) ది ఆస్ట్రో వరల్డ్ రిలీజ్ అవుతోంది.

  • అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇంగ్లీష్ సినిమా 'ది అమెచ్యూర్' (The Amateur) స్ట్రీమింగ్ కానుంది.

  • అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రెంట్ బేసిస్ విధానంలో 'క్లౌన్ ఇన్ ఏ కార్న్ ఫీల్డ్' (Clown In A Cornfield) అనే ఇంగ్లీష్ సినిమా అందుబాటులోకి రానుంది.

  • ఇంగ్లీష్ సినిమాలు 'Misericordia', 'When Fallis Coming' కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రెంట్ బేసిస్ విధానంలో అందుబాటులోకి రానున్నాయి. 


జూన్ 11న ఓటీటీల్లోకి వచ్చేవి ఏమిటో తెలుసా?



  • జియో హాట్ స్టార్ ఓటీటీలోకి డిస్నీ సినిమా 'స్నో వైట్' (Snow White) ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

  • నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి 'టైటాన్: ది ఓషియన్ గేట్ డిజాస్టర్' స్ట్రీమింగ్ కానుంది. అలాగే, 'కొకైన్ ఎయిర్: స్మగ్లర్స్ ఎట్ 30000 ఫీట్' అనే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది.

  • మెక్సికన్ సినిమా 'అవర్ టైమ్స్' (Our Times), పోలిష్ సిరీస్ 'అనియేలా' (Aniela), బ్రెజిలియన్ సినిమా 'చీర్స్ టు లైఫ్' కూడా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.


జూన్ 12 నుంచి తెలుగు సినిమాల స్ట్రీమింగ్ షురూ



  • అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో గతేడాది విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమా జూన్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

  • అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సినిమా 'డీప్ కవర్' స్ట్రీమింగ్ కానుంది.

  • జియో హాట్ స్టార్ ఓటీటీలో 'ది రియల్ హౌస్ వైఫ్స్ ఆఫ్ మియామీ' సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది.

  • థాయ్‌ సినిమా 'ఫ్లాట్ గాళ్స్', సౌదీ సినిమా 'మసమీర్ జూనియర్', ఫిలిప్పినో సినిమా 'అండ్ ద బ్రెడ్ విన్నర్స్' నెట్‌ఫిక్స్‌ ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యాయి.


జూన్ 13న సమంత 'శుభం', 'రానా నాయుడు 2'



  • ఆహా తమిళ్, టెంట్ కొట్ట, సింప్లీ సౌత్, అమెజాన్ ప్రైమ్ వీడియో... నాలుగు ఓటీటీల్లో తమిళ సినిమా 'ఎలెవన్' (నవీన్ చంద్ర పోలీస్ రోల్ చేశారు) స్ట్రీమింగ్ కానుంది.

  • తెలుగులో పాటు ఇతర భాషల్లో మలయాళ సినిమా 'అలప్పూజా జింఖానా' సోనీ లివ్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అలాగే, సింప్లీ సౌత్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది.

  • సమంత నిర్మించిన ఫస్ట్ సినిమా 'శుభం' స్ట్రీమింగ్ కూడా జూన్ 13న. జియో హాట్ స్టార్ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

  • 'రానా నాయుడు' సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సిరీస్ ఇది.

  • నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇండోనేషియన్ సినిమా 'ఏ బిజినెస్ ప్రపోజల్' స్ట్రీమింగ్ కానుంది.  స్పానిష్ వెబ్ సిరీస్ 'టూ హాట్ తో హ్యాండిల్', జపనీస్ సినిమా 'సెల్స్ ఎట్ వర్క్' కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. 


Also Read: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో జైనాబ్ రావ్జీ ఎక్కడ? అఖిల్ వైఫ్ మిస్సింగ్... ఆ ఒక్కటీ గమనించారా? అసలేం జరిగింది?


వీకెండ్ ఓటీటీ రిలీజులు తక్కువే కానీ...  


జూన్ 14న జియో హాట్ స్టార్ ఓటీటీలో స్పానిష్ సినిమా 'వెన్ నో వన్ సీస్ అజ్' స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 15న ఇంగ్లీష్ సినిమా 'ది రూకీ' స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'ది చూజెన్: లాస్ట్ సూపర్' సీజన్ 5, జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇంగ్లీష్ సినిమా 'అండర్ డాగ్స్' స్ట్రీమింగ్ కానున్నాయి.


Also Readఅఖిల్ జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌... మహేష్, చరణ్ నుంచి సూర్య, యశ్ వరకు... ఎవరెవరు వచ్చారో ఫోటోల్లో చూడండి