Latest Telugu Movies OTT Streamings In Last Week: క్రైమ్, హారర్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా ప్రముఖ ఓటీటీలు కూడా అలాంటి జానర్స్‌లోనే మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. శుక్రవారం ఒకే రోజు 10 సినిమాలు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

Continues below advertisement


వాస్తవ ఘటనలతో '23' మూవీ


వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ '23'. తేజ, తన్మయి జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను 'మల్లేశం' ఫేం రాజ్.ఆర్ తెరకెక్కించారు. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో స్టూడియో 99 సంస్థ సినిమాను నిర్మించింది. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా... తాజాగా 'ఈటీవీ విన్'లోనూ అందుబాటులోకి వచ్చింది.  'డబ్బు, కులం, అధికారం... ఇవేవీ లేని వారికి న్యాయం దొరకదా!' అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది.


స్టోరీ ఏంటంటే?


1991లో ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ, 1993లో సంచలనం రేపిన చిలకలూరిపేట బస్సు దహనం ఘటన సహా జూబ్లీహిల్స్ కారు బాంబు గురించి ఈ చిత్రంలో చూపించారు. ఒకే గ్రామానికి చెందిన యువతి యువకుడు ప్రేమించుకోగా... ఆర్థిక ఇబ్బందులతో ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి బస్సు దోపిడీకి యత్నిస్తాడు. ప్రయాణికులను బెదిరించేందుకు పెట్రోల్ పోయగా అది ప్రమాదవశాత్తు అంటుకుంటుంది. దీంతో 23 మంది సజీవ దహనమవుతారు. ఆ తర్వాత వారికి ఉరి శిక్ష పడుతుంది. ఆ తర్వాత బాంబు పేలుడు ఘటనలో హంతకులకు ఏ శిక్ష పడింది. అసలు నిందితులకు ఉరి శిక్ష విధించారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


Also Read: 'కన్నప్ప' రివ్యూ: 'బాహుబలి' రేంజ్‌లో ట్రై చేసిన విష్ణు మంచు... ప్రభాస్ క్యారెక్టర్ సూపర్, మరి సినిమా?


ఆర్జీవీ బోల్డ్ మూవీ 'శారీ'


డైరెక్టర్ ఆర్జీవీ నుంచి వచ్చిన లేటెస్ట్ బోల్డ్ మూవీ 'శారీ'. ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా నటించిన ఈ మూవీకి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రవిశంకర్ వర్మ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ 'లయన్స్ గేట్ ప్లే' (Lionsgate Play)లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే 'అమెజాన్ ప్రైమ్'లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.



  • వీటితో పాటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం' మూవీ ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎవోల్ (తమిళ డబ్బింగ్ మూవీ - ఆహా తమిళ్ ఓటీటీ), నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారు (కన్నడ క్రైమ్ థ్రిల్లర్ - సన్ నెక్స్ట్)లో అందుబాటులోకి వచ్చాయి.

  • వెబ్ సిరీస్‌లు - ఫేమస్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 - నెట్ ఫ్లిక్స్, విరాటపాలెం - జీ5, బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - జీ5, స్మోక్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్) - ఆపిల్ ప్లస్.