Priyamani's Good Wife Web Series OTT Release On Jio Hotstar: ఓ వైపు మూవీస్ మరోవైపు వెబ్ సిరీస్‌లతో తనదైన నటనతో మెప్పిస్తున్నారు ప్రియమణి. రీసెంట్‌గా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో లీగల్ థ్రిల్లర్ డ్రామా సిరీస్‌తో రాబోతున్నారు. 

గుడ్ వైఫ్.. లాయర్‌గా...

ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్'ను అదే పేరుతో రీమేక్ చేస్తుండగా... నటి, దర్శకురాలు రేవతి ఈ సిరీస్ రూపొందించారు. దీని స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్‌స్టార్'లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

'ప్రతి శక్తిమంతమైన మహిళ వెనుక చెప్పేందుకు వేచి ఉన్న ఓ స్టోరీ ఉంటుంది.' అంటూ సదరు సంస్థ ఓటీటీ వేదికగా తమిళ వెర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ సిరీస్‌లో ప్రియమణి తరుణికగా సంపత్ రాజ్ భార్యగా కనిపించనున్నారు. 

Also Read: వామ్మో... రష్మిక భయపెట్టేసిందిగా - పాన్ ఇండియా మూవీ 'మైసా'... నేషనల్ క్రష్ లుక్ అదుర్స్

స్టోరీ ఏంటంటే?

సెక్స్ స్కామ్‌లో అరెస్టైన తన భర్తను కాపాడుకునేందుకు భార్య ఏం చేసింది?, అప్పటివరకూ పిల్లలు, ఫ్యామిలీయే ప్రపంచంగా ఉన్న ఆమె  లాయర్‌గా ఎందుకు మారింది? ఈ పోరాటంలో ఆమె విజయం సాధించిందా? అసలు ఆమె భర్త అరెస్ట్ వెనుక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. 'నాన్న నిజంగానే తప్పు చేశారా?' అంటూ పిల్లలు చెప్పే డైలాగ్... ప్రియమణి ఎమోషన్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.