Rashmika Mandanna Look Unveiled From Mysaa Movie: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన నెక్స్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం పోస్టర్ రిలీజ్ చేయగా సోలో వారియర్ లుక్‌లో ఆమె ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
నేషనల్ క్రష్... నెవర్ బిఫోర్...
ఈ మూవీకి 'మైసా' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయగా... ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో రష్మిక భయపెట్టేశారు. చేతిలో కత్తితో భయంకరమైన అవతారంలో ఆమెను చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ముక్కు పుడక, ట్రెడిషనల్ శారీతో పాటు రక్తంతో కూడిన ముఖం ఆమె పవర్ ఫుల్‌గా కనిపించారు. 'ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు ఏమాత్రం కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు. భయపెట్టేందుకు...' అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్నారు. వుమెన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో సోలో వారియర్‌గా రష్మిక కనిపించనున్నారని ఫస్ట్ లుక్‌ను బట్టి అర్థమవుతోంది. దీంతో ఆమె రోల్ ఏమై ఉంటుందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్‌తో నెవర్ బిఫోర్ అనేలా రష్మిక భయపెడుతుండగా ఆమె రోల్ ఏంటి? అనే దానిపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీతో హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పూలే దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో...
గత రెండేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు రష్మిక. ఇటీవలే 'కుబేర'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె... ఇప్పుడు వుమెన్ ఓరియెంటెడ్ మూవీతో డిఫరెంట్‌గా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గోండు తెగలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'మైసా'ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ స్టోరీపై రెండేళ్లు వర్క్ చేసినట్లు తెలిపారు.
లైనప్ మార్చేశారుగా...
అప్పటి 'పుష్ప' నుంచి మొన్నటి 'కుబేర' వరకూ తన యాక్టింగ్‌తో మెప్పించారు నేషనల్ క్రష్. 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆమె నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు తాజాగా తన లైనప్ మార్చి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్', బాలీవుడ్ మూవీ 'థామా'తో రాబోతున్నారు. తాజాగా... 'మైసా' అనౌన్స్ చేశారు.