Bigg Boss Season 9 Promo Released: టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫన్ అందించే ఫేమస్ రియాల్టీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్ అప్డేట్ వచ్చేసింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.

నాగ్ ఎంట్రీ అదుర్స్

'బిగ్ బాస్' సీజన్ 9 ప్రోమోలో హోస్ట్ నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. స్టైలిష్ లుక్‌లో తనదైన డైలాగ్‌తో గూస్ బంప్స్ తెప్పించారు. 'ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగమే.' అంటూ నాగ్ చెప్పే డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది.

ఆ రూమర్లకు చెక్

గతంలో 'బిగ్ బాస్' హోస్ట్‌ను మారుస్తారనే ప్రచారం సాగింది. తాజా ప్రోమోతో మళ్లీ హోస్ట్‌గా కింగ్ నాగార్జునే ఉంటారని కన్ఫర్మ్ అయ్యింది. ఫస్ట్ సీజన్‌కు ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సీజన్ల నుంచి నాగార్జునే హోస్ట్‌గా ఉన్నారు. 'బిగ్ బాస్' అంటేనే గుర్తొచ్చేలా నాగ్ ఆ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సీజన్ 9కు కొత్త హోస్ట్ వస్తారని రూమర్స్ వచ్చాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించాయి. అయితే, కింగ్ నాగార్జుననే ఈ షోకు మళ్లీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

వెయిటింగ్ చెక్.. ఎగ్జైటింగ్

బిగ్ బాస్ అంటే టీవీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కు ఎప్పటికీ క్రేజే. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారి వెయిటింగ్‌కు చెక్ పెట్టారు. ఇక ఈ షోలో పార్టిసిపెంట్స్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక సీజన్ 8లో విన్నర్‌గా నిఖిల్ నిలిచారు. ఫైనల్‌లో గౌతమ్‌ను వెనక్కి నెట్టి రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మారుతీ కారును గెలుచుకున్నారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి తన ఆటతో గెలుపు సొంతం చేసుకున్నారు.

 

Also Read: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ ఎంట్రీకి అరుపులే... సర్‌ప్రైజ్ చేసిన విష్ణు మంచు... సోషల్ మీడియాలో సినిమా టాకేంటి?

కంటెస్టెంట్స్ వాళ్లేనా..

బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్న వారిలో చాలా మంది ఈ షోలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ కుకింగ్ షో 'కూకు విత్ జాతిరత్నాలు' కామెడీ షోలోని కంటెస్టెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షో స్టార్ట్ కానుంది.