విష్ణు మంచు (Vishnu Manchu) హీరోగా నటించిన 'కన్నప్ప' (Kannappa Movie) ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించడం వల్ల తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. శివ‌పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించిన మరొక స్పెషల్ అట్రాక్షన్. మోహన్ లాల్ మరో పాత్రలో చేయడం వల్ల మలయాళంలో మంచి బజ్ ‌ నెలకొంది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా టాక్ ఎలా ఉంది? ఎవరేమంటున్నారు? ట్వీట్స్ ఎలా ఉన్నాయి? అనేది ఒక్కసారి చూడండి. 

ప్రభాస్ ఎంట్రీకి అరుపులే!Kannappa Movie Twitter Review: 'కన్నప్ప' చూసిన జనాలు ఎవరైనా సరే ముందుగా ప్రభాస్, అతను పోషించిన రుద్ర పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎంట్రీకి అరుపులే అని చెబుతున్నారు. రుద్రుడిగా ప్రభాస్ అదరగొట్టారట. ఈ మాత్రం చాలు ప్రభాస్ అభిమానులంతా సినిమాకు క్యూ కట్టడానికి!

Also Read'కన్నప్ప' ఫస్ట్ రివ్యూ: 'కాంతార'లా క్లైమాక్స్... విష్ణు మంచు హిట్టు కొట్టాడా? ఎర్లీ రిపోర్ట్ ఎలా ఉందంటే?

శివపార్వతులుగా అక్షయ్ - కాజల్ సన్నివేశాలతో కన్నప్ప సినిమా ప్రారంభం అవ్వగా... ఆ తర్వాత తిన్నడుగా విష్ణు మంచు ఎంట్రీ ఇచ్చారట. దేవుడి మీద భక్తి భావం లేని తిన్నడు...‌‌‌ పరమ శివ భక్తునిగా ఎలా మారాడు అనేది కథ. ఫస్ట్ ఆఫ్ యావరేజ్ అని, కాస్త బోరింగ్ మూమెంట్స్ ఉన్నాయని, సెకండ్ హాఫ్ సూపర్బ్ అని ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతున్నారు.

Also Readకన్నప్ప: టికెట్ రేట్స్, థియేటర్స్ కౌంట్ to సెన్సార్ కట్స్, బడ్జెట్ వరకు... మీకు ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసా?

సర్‌ప్రైజ్ చేసిన విష్ణు మంచు!'కన్నప్ప' చూసిన జనాలు అందరూ చెప్పేది ఒక్కటే మాట..‌. ఈ సినిమాలో చివరి గంట చాలా బాగుందని! అలాగే విష్ణు మంచు నటన గురించి! పతాక సన్నివేశాలలో ఆయన నటన అందరిని ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. పాటలు సినిమాకు బలంగా నిలబడ్డాయట. డివోషనల్ సాంగ్స్ బావున్నాయని స్క్రీన్ మీద కూడా బాగా పిక్చరైజ్ చేశారని చెబుతున్నారు. లెంగ్త్ కొంచెం కట్ చేసి, ఫస్ట్ అఫ్ బాగా తీసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని, భారీ అంచనాలతో కాకుండా థియేటర్లకు వెళితే సినిమా‌ నచ్చుతుందట.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో

నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయట. విష్ణు మంచు ఖర్చుకు రాజీ పడలేదని చెబుతున్నారు. ప్రభాస్ మోహన్, లాల్ సీన్లు అద్భుతంగా వచ్చాయని టాక్. థియేటర్లకు వెళ్లే ముందు కన్నప్ప గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్విట్టర్ రివ్యూలు చూడండి.