Kannappa Movie Review In Telugu: 'కన్నప్ప'ను బుధవారం రాత్రి ముంబైలో కొంత మందికి చూపించారు. థియేటర్లలో విడుదలకు రెండు రోజుల ముందు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు, రివ్యూ రైటర్లకు స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. ఆల్రెడీ సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? ఎర్లీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

Continues below advertisement


'కాంతార' తరహాలో ఇంటెన్స్ క్లైమాక్స్!
Kannappa Climax: 'కన్నప్ప' చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చిన జనాలు ముందుగా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. రిషబ్ శెట్టి 'కాంతార' క్లైమాక్స్ ఎంత ఇంటెన్సిటీతో చూపు తిప్పుకోనివ్వని విధంగా ఉందో... 'కన్నప్ప' క్లైమాక్స్ కూడా అలాగే ఉందని అంటున్నారు. ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా ఆ పరమ శివుని భక్తులు అందరూ భక్తిభావంతో కంటతడి పెట్టుకుంటూ బయటకు వస్తారని ఎర్లీ రిపోర్ట్స్ బట్టి అర్థం అవుతోంది.


స్లో ఫస్టాఫ్... మోహన్ లాల్, ప్రభాస్ సూపర్!
పరమేశ్వరునికి అపర భక్తుడు అయినటువంటి తిన్నడు ('కన్నప్ప') కథతో ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. నాస్తికుడి నుంచి శివ భక్తుడిగా తిన్నడు ఎలా మారాడు? 'కన్నప్ప' ఎలా అయ్యాడు? అనేది సినిమా. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ బాగా చూపించారట. అయితే... 


'కన్నప్ప' ఫస్టాఫ్ కొంత స్లోగా ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ వరకు బండి నిదానంగా ముందుకు కదిలిందట. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ ఎపిసోడ్ టెర్రిఫిక్ అని రిపోర్ట్స్ వచ్చాయి. అతిథిగా 40 నిమిషాల పాటు కనిపించే ప్రభాస్, రుద్ర పాత్రలో తనదైన నటన సినిమాను మరో మెట్టు ఎక్కించారట. క్లైమాక్స్ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకు వెళ్లిందని టాక్.


విష్ణు తప్ప మరొకర్ని ఊహించుకోలేం!
'కన్నప్ప' పాత్రలో నటించడం కోసమే పుట్టినట్టుగా విష్ణు మంచు అద్భుతమైన నటన కనబరిచారని బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయన పెర్ఫార్మన్స్ టాప్ లెవల్ అట. యాక్షన్, ఎమోషనల్... రెండు సన్నివేశాల్లోనూ బాగా చేశారట. 'కన్నప్ప' పతాక సన్నివేశాల్లో చివరి 15 నిమిషాలు విష్ణు మంచు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అట. ప్రేక్షకులకు తప్పకుండా అతని నటన నచ్చుతుందని చెబున్నారు.


Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో


పరమేశ్వరుని పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ జంట నటన సైతం అద్భుతమని బాలీవుడ్ రిపోర్ట్. మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ చాలా బావుందట. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారట. 


How Is Kannappa Movie?: ఓవరాల్‌గా 'కన్నప్ప' మంచి సినిమా అని ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఫస్టాఫ్ నిదానంగా కదలడం, నిర్మాణ విలువలు కాస్త తక్కువగా ఉండటం మైనస్ పాయింట్స్ అయితే... విష్ణు మంచు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చిన లాస్ట్ 40 మినిట్స్, ఆ క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయని టాక్. అక్షయ్ కుమార్, ప్రభాస్ క్యారెక్టర్లు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. టికెట్ రేటుకు సరిపడా వినోదాన్ని అందిస్తుందట. తెలుగు ఆడియన్స్ నుంచి సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.


Also Readఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?