Meenakshi Chaudhary Has Altered The Spelling Of Her Name: ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ ఎంచుకుంటూ ఆడియన్స్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు మీనాక్షి.

పేరు మార్చుకున్నారు

మీనాక్షి చౌదరి తాజాగా తన పేరు మార్చుకున్నారు. ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో 'a' అంటూ మరో లెటర్ చేర్చారు. ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం... ఇప్పటివరకూ 'Meenakshi Chaudhary'గా ఉన్న పేరును 'Meenaakshi Chaudhary'గా మార్చుకున్నారు. ఇకపై ఆమె లేటెస్ట్ మూవీస్‌లో ఈ పేరునే ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: 'కన్నప్ప'కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు... కానీ అన్నయ్య విష్ణు పేరు లేదుగా... తమ్ముడు మనోజ్ ట్వీట్ వైరల్

వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న ఈ ముద్దుగుమ్మ అటు తెలుగు ఇటు తమిళంలో ఫుల్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. గతేడాది 'లక్కీ భాస్కర్', ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. స్క్రిప్ట్, సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మీనాక్షి. నాగచైతన్యకు జోడీగా ఓ మూవీలో నటిస్తుండగా.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇవే కాకుండా మెగాస్టార్ 'విశ్వంభర'లోనూ కీలక పాత్ర పోషిస్తుండగా... మరో రెండు తెలుగు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తమిళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

డాక్టర్ నుంచి యాక్టర్‌గా..

మీనాక్షి చౌదరి (Meenaakshi Chaudhary) డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారారు. హర్యానాలోని పంచకులలో ఈమె జన్మించగా... తండ్రి పీఆర్ చౌదరి ఇండియన్ ఆర్మీ కల్నల్. పంజాబ్‍లోని డేరా బస్సీలో నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేశారు. చదువుతో పాటే స్టేట్ లెవల్ స్విమ్మర్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గానూ సత్తా చాటారు. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో 'మిస్ IMA' అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత ఏడాది మిస్ ఇండియా రన్నరప్‌గా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.

తొలుత బాలీవుడ్ మూవీ 'అప్ స్టార్ట్స్'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి. 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఖిలాడి, హిట్: ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్‌తో ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. కొలై, సింగపూర్ సెలూన్, గోట్ వంటి తమిళ మూవీస్‌లోనూ మెరిశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీనాక్షి తన లేటెస్ట్ ఫోటోస్‌తో పాటు బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తుంటారు. తన అందం, అభినయం, నటనతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసిన మీనాక్షి ఈ ఏడాది కూడా హిట్ పరంపర కొనసాగించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.