Kamal Haasan Thug Life Movie Face 25 Lakhs Fine: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ 'థగ్ లైఫ్'. ఎన్నో అంచనాలు... కొన్ని వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే మూవీ టీంకు షాక్స్ తగలగా... తాజాగా సినిమాపై రూ.25 లక్షల ఫైన్ విధించినట్లు తెలుస్తోంది.

ఆ రూల్ బ్రేక్ చేశారనే..

సాధారణంగా ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అయితే... 'థగ్ లైఫ్' మాత్రం థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పారు కమల్ హాసన్. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో మల్టీఫ్లెక్స్ థియేటర్స్ రూ.25 లక్షల ఫైన్ వేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే... మూవీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో రూ.90 కోట్లు మాత్రమే ఇస్తామని మెలిక పెట్టింది. దీనిపై మేకర్స్ అభ్యంతరం చెప్పగా... చర్చల తర్వాత రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 

మణిరత్నం సారీ చెప్పారా?

మరోవైపు, డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో సారీ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వచ్చిన మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగిన విధంగానే ప్రమోషన్స్‌తో పాటు వివాదాలు కూడా సాగాయి. బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ తేడా కొట్టడంతో డైరెక్టర్ క్షమాపణ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read: అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్ - బాలీవుడ్ To టాలీవుడ్.. 'కన్నప్ప' డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వరుస వివాదాలు

ఈ సినిమా రిలీజ్ కాక ముందే వివాదం నెలకొంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో కమల్ కామెంట్స్ కాంట్రవర్శీగా మారాయి. 'కన్నడ తమిళం నుంచే పుట్టింది' అంటూ కామెంట్ చేయగా... కన్నడిగులతో పాటు రాజకీయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమల్ 'సారీ' చెప్పాలని ఆ వ్యాఖ్యలు వెనక్కు  తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే... సారీ చెప్పేందుకు ఇష్టపడని కమల్ తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. దీనిపై ఇరు వర్గాలు కోర్టును సైతం ఆశ్రయించాయి.

ఇక కర్ణాటకలో మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడగా... విడుదలను అడ్డుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చిత్రానికి భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అటు... కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా వరుస వివాదాలు 'థగ్ లైఫ్'ను వెంటాడాయి.

ఈ మూవీలో కమల్ హాసన్‌తో పాటు శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. నాజర్, అశోక్ సెల్వన్, తనికెళ్లభరణి, నాజర్, మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. కమల్ హాసన్, మహేంద్రన్, మణిరత్నం నిర్మాతలుగా వ్యవహరించారు.