Vijay Antony About Bichagadu 3 Movie: కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' మూవీతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆయన లేటెస్ట్ మూవీ 'మార్గన్'తో మళ్లీ ఎంటర్‌టైన్ చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'బిచ్చగాడు 3'పై అప్డేట్
మీ డైరెక్షన్‌లో మూవీ ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్నకు... 'బిచ్చగాడు 3' అంటూ విజయ్ సమాధానం ఇచ్చారు. 2027 సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పారు. 'పిచ్చైకారన్' అనే తమిళ సినిమాను తెలుగులో 'బిచ్చగాడు'గా రీమేక్ చేశారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా.. విజయ్ ఆంటోని, సాట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి తన తల్లి ఆరోగ్యం కాపాడుకునేందుకు బిచ్చగాడుగా ఎందుకు మారాడు? అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది.
ఇదే జోష్‌తో 'బిచ్చగాడు 2' తెరకెక్కించినా ఫస్ట్ పార్ట్‌కు వచ్చినంత క్రేజ్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలోనే 'బిచ్చగాడు 3' తెరకెక్కించబోతున్నారు.
'మార్గన్' మూవీ గురించి...
ఇక విజయ్ ఆంటోని లేటెస్ట్ మూవీ 'మార్గన్' విషయానికొస్తే.. జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా... సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్‌పై జె.రామాంజనేయులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీగా హైప్ క్రియేట్ చేశాయి. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
సినిమాలో విజయ్ ఆంటోనీతో పాటు సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చగా... రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.
Also Read: అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్ - బాలీవుడ్ To టాలీవుడ్.. 'కన్నప్ప' డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
యూట్యూబ్‌లో ఫస్ట్ 6 మినిట్స్
ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను అలరించే విజయ్ ఆంటోనీ ఈసారి కూడా 'మార్గన్' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకూ ఎవరూ చేయని రీతిలో రిలీజ్‌కు ముందే సినిమా ఫస్ట్ 6 మినిట్స్‌ను మేకర్స్ నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. మూవీపై హైప్ మరింత క్రియేట్ చేసేందుకు ఇలా చేయగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఓ ఆగంతుకుడు వెనుక నుంచి దాడి చేసి ఇంజక్షన్ వేయగా ఆమె నలుపు రంగులో మారి చనిపోతుంది. ఈ మర్డర్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు ఆమెను చంపారు? పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ ఆంటోనీ ఏం చేశారు? అసలు గతం ఏంటి? అనే ప్రశ్నలను ఫస్ట్ 6 మినిట్స్ వీడియోలో చూపించారు. దీంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.