Singer Pravasthi About Her Elimination Episode: సింగింగ్ రియాలిటీ షో 'పాడుతా తీయగా'పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య అప్పట్లో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని.. బాడీ షేమింగ్ చేశారంటూ ఆమె షో నిర్వాహకులు, జడ్జెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా... ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా దీనిపై కూడా ప్రవస్తి రియాక్ట్ అయ్యారు.

Continues below advertisement


అన్ ఎతికల్ ఎడిటింగ్


ఓ రియాలిటీ షోలో ఎపిసోడ్‌ను ఇంత అన్ ఎతికల్‌గా ఎడిట్ చేస్తారని తాను అనుకోలేదని ప్రవస్తి తెలిపారు. తన ఎలిమినేషన్ ఎపిసోడ్‌కు సింగర్ సునీత తప్ప వేరే ఎవరూ లేరని ఆమె చెప్పగా... తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో ముగ్గురు జడ్జీలు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేశారు. 'ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదని అనుకున్నా.. ఆ ఎపిసోడ్ చూసి షాక్ అయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తారని అనుకోలేదు. ఎడిట్ చేస్తారని ఊహించా. కానీ ఇలా అక్కడక్కడ ముక్కలు కట్ చేసి.. అన్ ప్రొఫెషనల్‌గా చేస్తారని మాత్రం ఊహించలేదు.' అని అన్నారు.


ఫూల్స్‌ను చేసేలా...


ఎపిసోడ్ చూసిన చాలా మంది నిజం తెలుసుకుని తనకు మెసేజ్‌లు చేసినట్లు ప్రవస్తి తెలిపారు. 'మిగిలిన ఎలిమినేషన్స్‌తో పోల్చుకుంటే ఇది చాలా అన్యాయంగా ఉందని కామెంట్స్ చేశారు. చాలా ఎడిట్ చేశారు. జనాలను ఈజీగా ఫూల్స్‌ను చెయ్యొచ్చని అనుకున్నారు. నా ఎలిమినేషన్ టైంలో సునీత మేడం తప్ప మిగతా జడ్జీలు లేరు. చంద్రబోస్, కీరవాణి సర్ లేనే లేరు. కానీ వారు చప్పట్లు కొడుతున్న సీన్ ఎక్కడి నుంచి అతికించి తెచ్చారో నాకు తెలీదు.






నేనైతే ఎలిమినేషన్ టైంలో మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ఎలిమినేషన్ టైంలో నాకెన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు ఎలిమినేట్ చేశారు? అనే అంశాలు చూపించలేదు. ఇంత అన్ ప్రొఫెషనల్ రియాలిటీ షోలో ఉండడం అనవసరం అనిపించింది. నేను మిస్టేక్స్ చేయలేదు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందనే ఇదంతా మాట్లాడుతున్నా. ప్రేక్షకులను ఫూల్స్‌ను చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను. విన్నర్ అయిన వారికి కూడా ఆ సంతృప్తి మిగులుతుందని అనుకోవడం లేదు. వాళ్లకు నచ్చిన వారే గెలుస్తారు.' అంటూ పేర్కొన్నారు.


Also Read: అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్ - బాలీవుడ్ To టాలీవుడ్.. 'కన్నప్ప' డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?


అసలేం జరిగిందంటే?


'పాడుతా తీయగా' సింగింగ్ రియాలిటీ షో నుంచి తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని.. బాడీ షేమింగ్‌ చేశారని సాంగ్ సెలక్షన్, డ్రెస్సింగ్ ఇలా అన్నింటిలోనూ ఇబ్బందులు పెట్టారంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సింగర్ సునీత్ సైతం స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా.. ఎలిమినేషన్ ఎపిసోడ్ ఫుల్ అన్ ఎతికల్‌గా ఎడిట్ చేశారంటూ వీడియో రిలీజ్ చేశారు. మరి దీనిపై షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.