Vishnu Manchu Emotional Post On Kannappa: విష్ణు మంచు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ స్టోరీ, స్క్రిప్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ ఇలా దాదాపు పదేళ్లు విష్ణు శ్రమించారు. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోస్‌కు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఫుల్ జోష్ నెలకొంది. 'ఎక్స్' వేదికగా విష్ణు మంచు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఈ క్షణం కోసం...
ఈ క్షణం కోసం తాను జీవితాంతం ఎదురు చూసినట్లు విష్ణు తెలిపారు. 'ఈ బెస్ట్ మూమెంట్ కోసం నా జీవితాంతం ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్స్, ఇండియాలో తొలి షోకు వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ ఈ మూవీపై చూపుతోన్న ప్రేమను చూస్తుంటే నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. 'కన్నప్ప' ఇక నా సినిమా కాదు. ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా.' అంటూ రాసుకొచ్చారు.
మరోవైపు... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ గురించి పోస్ట్ పెట్టారు. 'కన్నప్ప ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు. భక్తి కోసం తన నేత్రాన్నే కాదు. తన జీవితాన్ని కూడా అంకితం చేసిన ఓ గొప్ప వ్యక్తి. ఇప్పుడు మిమ్మల్ని కూడా భక్తి పారవశ్యంలో మునిగేలా చేస్తాడు.' అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో రుద్రుడిగా ఆయన ఎంట్రీ వేరే లెవల్ కాగా... ప్రభాస్ కనిపించినప్పటి నుంచే సినిమా వేరే స్థాయికి వెళ్లిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూవీలో కిరాత రోల్‌లో కనిపించిన మోహన్ లాల్ కూడా మూవీపై పోస్ట్ పెట్టారు. 'అందరూ దగ్గర్లోని థియేటర్లలో కన్నప్పను చూడండి.' అని కోరారు.
హిట్ టాక్
ఇప్పటికే ఓవర్సీస్‌లో 'కన్నప్ప' ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా... రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ నుంచి మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ మూవీకే హైలైట్ విష్ణు మంచు తన కెరీర్‌లోనే బెస్ట్ ఇచ్చారని అంటున్నారు. డివోషనల్ సాంగ్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలు పోషించారు.