OTT Releases This Week: నయన్‌, త్రిష సినిమాల నుంచి రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి వెబ్ సిరీస్‌ల వరకు... ఈ వారం ఓటీటీలో రిలీజులు

OTT Releases This Week Telugu: నెట్‌ఫ్లిక్స్‌, సోనీ లివ్, ప్రైమ్ వీడియో నుంచి జీ5, ఆహా వరకు ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసుకోండి.

Continues below advertisement

ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీల్లోకి వస్తున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో తెలుసా? సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు ఇద్దరి సినిమాలు, తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్టార్ స్టేటస్ అందుకున్న ఇద్దరు నటులు చేసిన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. అవి ఏమిటో చూడండి.

Continues below advertisement

ఏప్రిల్ 4 నుంచి నయనతార 'టెస్ట్' స్ట్రీమింగ్
Netflix original movie test streaming date: ఆర్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'టెస్ట్'. శుక్రవారం (ఏప్రిల్ 4వ తేదీ) నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. థియేటర్లలో విడుదల చేయాలని తొలుత ప్లాన్ చేశారు. అయితే... అనూహ్యంగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమా అంటే ఇదే. 

రాజీవ్ కనకాల వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్'
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, నటి ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్'. ఆహా ఓటీటీ కోసం రూపొందిన ఒరిజినల్ సిరీస్ ఇది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ప్రొడ్యూస్ చేసిన నవీన్ మేడారం ఈ సిరీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మీద రూపొందిన ఈ సిరీస్ అన్ని వర్గాల వీక్షకులను ఆకట్టుకుంటుందని ఆహా వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. 

ఈటీవీ ఓటీటీలో తనికెళ్ల భరణి వెబ్ సిరీస్!
ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవుతున్న వెబ్ సిరీస్‌లలో తనికెళ్ల భరణి, తులసి, బాలాదిత్య, సోనియా సింగ్, గీతా భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన యాంథాలజీ 'కథా సుధ' ఒకటి. ఐదు కథల సంకలనంగా ఈ సిరీస్ రూపొందించారు. 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న‌ సూపర్ విజన్‌లో రూపొందింది. ప్రతి ఆదివారం ఒక్కొక్క కథను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందులో మొదటి కథ ఏప్రిల్ 6న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కానుంది. ఆ తర్వాత నుంచి ప్రతి ఆదివారం 4 వారాల పాటు ఒక్కో కథ వీక్షకుల ముందుకు వస్తుంది.

హిందీలో త్రిష 'ఐడెంటిటీ'... ఈ వారమే విడుదల!
మలయాళ హీరో టోవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ సినిమా 'ఐడెంటిటీ'. గత ఏడాది థియేటర్లలో విడుదల అయింది. జనవరి 31 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్ రెడీ అయింది. 

జియో హాట్‌స్టార్‌లో నవదీప్ వెబ్ సిరీస్ ఈ వారమే!
నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన జియో హాట్‌స్టార్‌ వెబ్ సిరీస్ 'టచ్ మీ నాట్'. ఇందులో 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి, తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాగశౌర్య 'అశ్వద్ధామ' చిత్రానికి దర్శకత్వం వహించిన రమణ తేజ ఈ వెబ్ సిరీస్ దర్శకుడు. ఇంటెన్స్ థ్రిల్లర్ కింద రూపొందిన ఈ సినిమా శుక్రవారం ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also Readఆదిత్య 369 రీ రిలీజ్... బాలయ్య సినిమాతో ఈ వారం థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమాలు ఏమిటంటే?

వరలక్ష్మి 'మధుశాల'... ఆల్రెడీ ఈటీవీలో స్ట్రీమింగ్ షురూ!
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మధుశాల'. సుధాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పొట్లూరి సత్యనారాయణ నిర్మించారు. మనోజ్ నందం, బేబీ యానీ, ఇనయా సుల్తానా, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ రఘుబాబు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెన్స్ డ్రామా, కామెడీతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

Also Read: కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించడంతో పాటు నిర్మించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా 'కింగ్స్టన్'. మార్చి 7న థియేటర్లలో విడుదల అయింది. దివ్య భారతి హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1న 'జరూర్‌ #2' వెబ్ సిరీస్, 3న 'రియల్ పెయిన్' సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీ లీవ్ ఓటీటీలో 'చమక్ సీజన్ 2' శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Continues below advertisement