Salman Khan's Sikindar Movie OTT Release On Netflix: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో లేసెట్ట్ మూవీ 'సికిందర్' (Sikindar). ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు.
ఆ ఓటీటీలోకి 'సికిందర్'
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ రైట్స్ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ సినిమాల చాలా వరకూ ఇటీవల థియేటర్‌లో రిలీజైన ఎనిమిది వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. 'సికిందర్' కూడా అప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ 'సికిందర్'పై హైప్‌ను పెంచేశాయి. సల్మాన్ యాక్షన్ వేరే లెవల్ అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ప్రముఖ నటుడు సత్యరాజ్ నెగిటివ్ రోల్‌లో చేస్తున్నారు.
Also Read: ప్రతీ ఆదివారం ఓ కొత్త కథ - కొత్త స్టోరీలతో ముందుకు వస్తోన్న 'ఈటీవీ విన్'.. ఫస్ట్ స్టోరీ ఎప్పుడంటే?