Just In





The Family Man 3 OTT Release: స్పై థ్రిల్లర్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ - ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Family Man 3: బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ సీజన్ 3 ఈ నవంబర్ నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది.

Manoj Bajapayee's The Family Man 3 Web Series OTT Streaming On Amazon Prime Video: హారర్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్, సిరీస్‌ల ట్రెండ్ సాగుతున్న క్రమంలో ఆడియన్స్‌ను పలు వెబ్ సిరీస్‌లు విశేషంగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలా భారతీయ వెబ్ సిరీస్‌ల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది 'ది ఫ్యామిలీ మ్యాన్' (The Family Man). ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకోగా మూడో సీజన్ కోసం అటు ఓటీటీ లవర్స్‌తో ఇటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సిరీస్‌లో బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajapayee), ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించగా.. తెలుగు దర్శక ద్వయం రాజ్ & డీకే ఈ షోని తెరకెక్కించారు. ఈ సిరీస్ సీజన్ 3 ఈ నవంబర్ నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానున్నట్లు మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. తాజాగా దీనిపై ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.
బాలీవుడ్ స్టార్ జైదీప్ అహ్లావత్.. 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'లో (The Family Man 3) కనిపించనున్నట్లు మనోజ్ తెలిపారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని చెప్పారు. 'పాతాళ్‌లోక్-2లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న జైదీప్ అహ్లావత్ రెండేళ్ల క్రితమే ఇందులో జాయిన్ అయ్యారు. ఆయన రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ పాత్ర వివరాలు మాత్రం ఇప్పుడే వెల్లడించలేం. ఈ నవంబర్ నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.' అని తెలిపారు. అయితే, సిరీస్‌లో జైదీప్ నటిస్తున్నారని తెలిసినా.. రెండేళ్ల క్రితమే ఆయన భాగమయ్యారని ఎవరికీ తెలియదు. ఈ స్పై థ్రిల్లర్‌లో అగ్ర నటుడు భాగం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.
విలన్‌గా జైదీప్ అహ్లావత్?
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్‌గా 2 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ సైతం సిద్ధమవుతోంది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ తిరిగి రాబోతుండగా.. ఈ సీజన్ యాక్షన్, సస్పెన్స్‌తో పాటుగా ట్రేడ్ మార్క్ హ్యూమర్ సమ్మేళనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో జైదీప్ అహ్లావత్ నెగిటివ్ రోల్‌లో చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్, శ్రీలంకలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్‌లో గత 2 సీజన్స్ రూపొందించారు. ఈ కొత్త సీజన్‌లో చైనాతో పొంచి ఉన్న ప్రమాదం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఫస్ట్ సీజన్‌లో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటించగా.. సీజన్ 2లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కీలక పాత్ర పోషించారు. ఆ సీజన్‌లో ఆమె ప్రతినాయకురాలిగా నటించారు. తమిళ టైగర్స్ తరఫున పోరాటం చేసే మహిళగా కనిపించారు. ఇప్పుడు సీజన్ 3లో జైదీప్ నెగిటివ్ రోల్ చేస్తుండగా భారీగా హైప్ నెలకొంది. ఈ సిరీస్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.