తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) వరుస ఆఫర్లతో దూసుకు వెళుతోంది. ఈ మధ్య ఆవిడ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాకు సంతకం చేసినట్లు తెలిసింది. ఆ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కోటి రూపాయలు కామన్‌...వైష్ణవి చైతన్య క్రేజ్ కోసం తప్పదు!హీరోయిన్లుగా స్టార్ స్టేటస్ అందుకున్న తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది. ఆ విషయంలో దర్శక నిర్మాతల నుంచి ఒక్కోసారి మన అమ్మాయిలు ఎక్కువ మంది రావడం లేదని, వచ్చిన వాళ్లు అన్ని క్యారెక్టర్లు చేయడానికి రెడీగా లేరనే మాటలు వినబడతాయి! టాలెంట్ ఉంటే స్టార్ స్టేటస్ అందుకోవడం అంతా కష్టం ఏమీ కాదని వైష్ణవి చైతన్య ప్రూవ్ చేస్తున్నారు. యూట్యూబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు యంగ్ హీరోల సరసన క్రేజీ ఫిలిమ్స్ చేస్తున్నారు. కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి తెలుగు అమ్మాయిగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారని వినికిడి. 

'బేబీ'తో కథానాయికగా పరిచయమైన వైష్ణవి చైతన్య... ఫిమేల్ లీడ్ రోల్ చేసిన మొదటి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఆయన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ సరసన 'లవ్ మీ' సినిమా చేశారు. ఆ చిత్రానికి కోటి రూపాయల పారితోషకం అందుకున్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అది పక్కన పెడితే... ఇటీవల ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు వైష్ణవి చైతన్య సంతకం చేసినట్లు తెలిసింది. ఆ చిత్రానికి దర్శక నిర్మాతలు కోటి రూపాయలు ఆఫర్ చేశారట. 

ఆల్రెడీ వైష్ణవి పారితోషకం కోటికి కాస్త అటు ఇటుగా ఉంది. యూత్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులలో ఆవిడకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కనుక ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. పైగా సినిమా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకోవాలి. అందుకని ఆవిడకు కోటి రూపాయలకు పైగా ఇవ్వడానికి ఆ దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారట.

సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ముందడుగు!'బేబీ' భారీ విజయం సాధించడానికి, 100 కోట్లు వసూలు చేయడానికి వైష్ణవి చైతన్య పాత్ర, అందులో ఆవిడ నటన ప్రధాన కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ సినిమా ద్వారా ఆవిడకు వచ్చిన క్రేజ్ చాలా ఆఫర్లు తీసుకొచ్చింది. అయితే వైష్ణవి చైతన్య ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకోవడం లేదు.‌ తనకు వచ్చిన వాటిలో నచ్చిన కథలు, ఆ సినిమాలు నిర్మించే నిర్మాతలను సైతం దృష్టిలో పెట్టుకొని సంతకాలు చేస్తున్నారు.

Also Readసల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

స్టార్ బాయ్స్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన 'జాక్' సినిమాలో ఆవిడ నటించారు. ఏప్రిల్ 10న ఆ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ సరసన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న '90స్ ఏ మిడిల్ క్లాస్' బయోపిక్ వెబ్ సిరీస్ సీక్వెల్ కింద రూపొందుతున్న సినిమాలోను నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలు అగ్ర నిర్మాణ సంస్థల్లోవి కావడం గమనార్హం. సినిమాల ఎంపికలో ఆచితూచి జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు వైష్ణవి చైతన్య.

Also Readరాబిన్‌హుడ్ రివ్యూ: ఇది నితిన్‌ 'కిక్'... కథ తీసేస్తే కనీసం కామెడీ క్లిక్ అయ్యిందా? నితిన్‌కు హిట్ వస్తుందా?