Knock Knock Movie Explanation: 2015లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నాక్ నాక్‘ (Knock Knock). ఎలి రోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీను రీవ్స్, లోరెంజా ఇజ్జో, అనా డి అర్మాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం లయన్స్ గేట్ ప్రీమియర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘నాక్ నాక్‘ సినిమా ‘డెత్ గేమ్‘ మూవీకి రీమేక్.
‘నాక్ నాక్‘ మూవీ కథేంటంటే?
ఇవాన్ వెబ్బర్ వాస్తుశిల్పి. పెళ్లై పిల్లలతో సంతోషంగా ఉంటాడు. వీకెండ్‌లో భాగంగా అతడి భార్య, పిల్లలు బీచ్ ట్రిప్‌కు వెళ్తారు. ఆయన భార్య కరెన్ మంచి ఆర్టిస్టు. ఆమె ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయాల్సిన శిల్పాన్ని తన అసిస్టెంట్ లూయిస్‌కు అప్పగిస్తుంది. అయితే, వర్క్ కారణంగా ఇవాన్ వారితో పాటు ట్రిప్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు.
ఆ సమయంలో బయట బాగా వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఇద్దరు అమ్మాయిలు జెనెసిస్, బెల్ బాగా తడిసిపోతారు. ఇవాన్ ఇంటి ముందుకు వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. పార్టీ కోసం ఇక్కడికి వచ్చామని, ఫోన్ లు తడిసిపోవడంతో అడ్రస్ కనుక్కోలేకపోయామని చెప్తారు. తాము బట్టలు ఆరబెట్టుకుంటామని ఇవాన్‌ను అడుగుతారు. సరే అని అతడు వారిని లోపలికి రమ్మంటాడు. వారికి టవల్స్ తో పాటు, బట్టలు ఆరబెట్టుకునేందుకు డ్రైయర్ ఇస్తాడు. బట్టలు ఆరిన తర్వాత కూడా అతడితోనే సరసాలాడుతూ అక్కడే ఉండేందుకు ప్రయత్నిస్తారు.
కానీ, ఇవాన్ వారిని పంపించేందుకు క్యాబ్ బుక్ చేస్తాడు. క్యాబ్ వచ్చేలోగా ఇవాన్ పై చేతులు వేస్తూ అతడిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, వారి పద్దతి ఇవాన్‌కు నచ్చదు. క్యాబ్ ఇంటి ముందుకు రాగానే, కాసేపు తాము బాత్ రూమ్ ఉపయోగించుకుంటాం అని చెప్తారు. దానికి ఇవాన్ సరే అంటాడు. కానీ, ఎంతకూ బయటకు రారు. అతడు లోపలికి వెళ్లే సరికి దుస్తులు లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తారు. అతడిని వారు బలవంతం చేస్తారు. క్యాబ్ డైవర్ కు రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇవాన్‌ను బలవంతంగా లొంగ దీసుకుంటారు. వారిచ్చే సుఖానికి.. ఇవాన్ కూడా కాదనకుండా పనికానిచ్చేస్తాడు.
మరుసటి రోజు ఉదయం ఇవాన్ లేచే సరికి కిచెన్‌లో వారిద్దరు వంట చేస్తుంటారు. వస్తువులన్నింటీని చిందరవందరగా పడేస్తారు. వారిని చూడగానే ఇవాన్‌కు చాలా కోపం వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని కోప్పడతాడు. కానీ, వాళ్లు ఎంతకీ పట్టించుకోరు. అదే సమయంలో తన ఇంటికి ఓ బంధువు వస్తుంది. ఆమె ఇవాన్ తో కలిసి ఇద్దరు అమ్మాయిలు ఉండటాన్ని చూసి.. నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదని కోపంగా వెళ్లిపోతుంది. ఇవాన్ కోపంతో వారిని వెళ్లిపోవాలని అరుస్తాడు. లేదంటే పోలీసులకు కాల్ చేస్తానని ఫోన్ కలుపుతాడు. వెళ్లిపోతామని చెప్పడంతో వారిని కారు ఎక్కించుకుని వారి దింపమన్న చోట డ్రాప్ చేసి వస్తాడు.
ఇవాన్ ఇంటికి వచ్చి కిచెన్ శుభ్రం చేస్తుండగా, జెనెసిస్, బెల్ మళ్లీ ఇంటికి వస్తారు. అతడి భార్య శిల్పాలలో ఒకదాన్ని బద్దలుకొడతారు. బెల్ అతడిని మంచానికి కట్టేసి శృంగారం చేస్తుంది. ఇంకో అమ్మాయి దాన్ని రికార్డు చేస్తుంది. ఇవాన్ కట్లు తెంచుకుని వారిపై తిరగబడతాడు. కానీ, జెనెసిస్ తన దగ్గరున్న ఫోర్క్ తో అతడిని పొడుస్తుంది. అతడు కింద పడటంతో చైర్ కు కట్టేస్తారు.
అదే సమయంలో లూయిస్ శిల్పాన్ని గ్యాలరీకి తీసుకెళ్లేందుకు వస్తాడు. తాము ఇవాన్ చుట్టాలమని ఆ అమ్మాయిలు లూయిస్ కు చెప్తారు. లోపలికి పిలుస్తారు. అతడు లోపలికి వెళ్లగానే రక్తం కనిపిస్తుంది. ఇవాన్ ఎక్కడో చెప్పాలని, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తాడు. అదే సమయంలో తనక తీవ్రమైన ఆయాసం వస్తుంది. అతడి ఇన్ హెల్లర్ తీసుకుని ఇద్దరు అమ్మాయిలు దానితో ఆడుకుంటారు. చివరకు లూయిస్ కిందపడటంతో గాయమై చనిపోతాడు. ఆ అమ్మాయిలు లూయిస్ శవాన్ని ప్యాక్ చేసి అతడి కారులోనే పెడతారు. లూయిస్ ను ఇవానే చంపినట్లు సీన్ క్రియేట్ చేస్తారు.
ఆ తర్వాత ఇవాన్‌ను బాగా హింసిస్తారు. చివరకు పెరట్లో గొయ్యి తవ్వి ఇవాన్ తలను మాత్రం బయటకు పెట్టి బాడీ అంతటినీ పూడ్చివేస్తారు. తలపై బండరాయితో కొట్టి చంపేస్తామని బెదిరిస్తారు. కానీ, చంపకుండా వెళ్లిపోతారు. ఇవాన్‌తో ఇంటిమేట్ అయిన వీడియోను అతడి ఫోన్ నుంచే ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి అక్కడే పెట్టి వెళ్లిపోతారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఇవాన్ భార్య కరేన్.. ఇంట్లో చెత్తను చూసి ఏం జరిగిందో అనుకుంటుంది. వారి అమ్మాయి జాక్ నాన్న పార్టీ చేసుకున్నారేమో అంటుంది. అక్కడితో సినిమా అయిపోతుంది.
‘నాక్ నాక్‘ మూవీ ఎక్కడ చూడాలంటే?
ప్రస్తుతం ‘నాక్ నాక్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే, రెంట్ పే చేసి చూడాల్సి ఉంటుంది.
Read Also: సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా?- విశాల్ వీడియోపై నటి కస్తూరి తీవ్ర విమర్శలు