Prabhas Kalki Movie OTT Platform: పాన్ ఇండియా ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'కల్కి 2989 ఏడీ' ఒక్కటి. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి, థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుందో తెలుసా?


రెండు ఓటీటీల్లో 'కల్కి'... ఓ ట్విస్ట్!
Kalki 2989 AD digital streaming partner locked: 'కల్కి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రెండు ఓటీటీలకు ఇచ్చినట్టు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ టాక్. అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?


'కల్కి 2989 ఏడీ' హిందీ వెర్షన్ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Kalki 2989 AD Hindi Version Release On Netflix India)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి రానుంది. అదీ సంగతి! ఫ్యాన్సీ అమౌంటుకు డిజిటల్ రైట్స్ అమ్మినట్టు తెలుస్తోంది.


Also Readపాయల్‌కు ఇవ్వాల్సింది 6 లక్షలే - నాన్ కోపరేషన్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్, ఆమె ఆరోపణల్ని ఖండించిన TFPC



బుజ్జికి వచ్చిన రెస్పాన్స్ అదిరింది!
Kalki 2989 AD Release Date: 'కల్కి 2989 ఏడీ'ని తొలుత మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు జూన్ 27న విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ రిలీజ్ డేట్ మారే అవకాశం లేదు. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.


'కల్కి'లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ పేరు భైరవ. అతడితో పాటు ఉండే బుజ్జిని ఇటీవల ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ వీడియోకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా అందులో బుజ్జి (రోబోట్) పాత్రకు 'మహానటి' కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. అది ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.


Also Readపిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు


Kalki 2989 AD Movie Cast And Crew: 'కల్కి' ప్రభాస్ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ మూవీ కానుందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ చెయ్యడం ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో ఆయన లుక్ నుంచి గెటప్ వరకు ప్రతిదీ కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.  


'కల్కి 2989 ఏడీ' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉన్నత సాంకేతిక నిర్మాణ విలువలతో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడీగా బీ టౌన్ స్టార్ యాక్ట్రెస్ దీపికా పదుకోన్ యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ దిశా పాట్నీ కీ రోల్ చేశారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేశారు. 'కల్కి' విడుదలైన రెండు వారాల తర్వాత కమల్ హాసన్ సోలో హీరోగా నటించిన 'ఇండియన్ 2' సినిమా జూలై 12న విడుదల కానుంది.