గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'అధినాయకుడు' అని ఓ సినిమా వచ్చింది. అలాగే, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా 'శివ శంకర్', యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'గోరింటాకు', శ్రీకాంత్ 'లేత మనసులు' సినిమాలు ఉన్నాయి కదా! బాల నటుడిగా ఆయా సినిమాల్లో అలరించారు విశ్వ కార్తికేయ (Vishwa Karthikeya). ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. 'రేప్ డి' అని ఓ క్రైమ్ థ్రిల్లర్ చేశారు. అది నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది.  

Continues below advertisement


BCineETలో రెంట్ బేసిస్ మీద!
Rape D Movie OTT Streaming: విశ్వ కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కిన 'రేప్ డి' సినిమాలో కారుణ్య చౌదరి (Karunya Chowdary) కథానాయిక. టాలెంట్ కెఫె ప్రొడక్షన్ పతాకం మీద దేవీ మేరేటీ ప్రొడ్యూస్ చేశారు. సాధ్వి, ప్రణవి సమర్పకులు. ఈ చిత్రానికి రవి శర్మ దర్శకత్వం వహించారు.వైవీ రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలు.


Also Read: 'కమిటీ కుర్రోళ్ళు' చూస్టా... సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ - నిహారిక గురించి ఏం చెప్పారంటే?


ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమా 'రేప్ డి'. ఆగస్టు 10వ తేదీ నుంచి 'బీ సినీ నెట్' యాప్ (BCineET APP)లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్విస్ట్ ఏమిటంటే... రెంట్ బేసిస్ మీద సినిమా అందుబాటులో ఉంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది. RAPED100 కూపన్ అప్లై చేస్తే... వంద రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఆగస్టు 24 నుంచి ఇతర ఓటీటీ వేదికల్లో కూడా సినిమా అందుబాటులోకి రానుందని టాక్. ఈ సినిమాలో కారుణ్య చౌదరి పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు.


Also Readసమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం నడిపారా? లేదంటే విడాకుల తర్వాతా... అసలు నిజం ఏమిటంటే?



Rape D Movie Cast And Crew: విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి జంటగా నటించిన 'రేప్ డి' సినిమాలో వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి వికాస్ కురిమెల్ల సంగీతం అందించారు. ప్రకాష్ వేద కథ, మాటలు అందించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: భాస్కర్ ద్రోనాల, కూర్పు: మహేష్ కాసర్ల, సంగీత దర్శకుడు: వికాస్ కురిమెల్ల, నిర్మాణ సంస్థ: టాలెంట్ కెఫె ప్రొడక్షన్, సమర్పణ : సాధ్వి - ప్రణవి, నిర్మాత : దేవీ మేరేటీ, సహ నిర్మాతలు: వైవీ రమణ మూర్తి - యశ్వంత్ తోట, దర్శకత్వం: రవి శర్మ.


Also Readసుఖేష్‌ ది ఏమి ప్రేమ రా... జాక్వెలిన్ కోసం వాయనాడ్ బాధితులకు15 కోట్ల విరాళం, 300 ఇళ్లు... ఫ్యాన్స్‌కు 100 ఐ ఫోన్ గిఫ్టులు