కేరళలోని వాయనాడ్ విధ్వంసం నేపథ్యంలో అక్కడి బాధితుల సహాయక చర్యల నిమిత్తం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 2 కోట్లు, మన మెగాస్టార్ చిరంజీవి - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా కోటి రూపాయలు ఇవ్వగా... ఇంకా పలువురు తారలు తమ వంతు మేరకు సాయం చేశారు. వీళ్లందరినీ మించి రూ. 15 కోట్లు ఇచ్చారు సుఖేష్ చంద్రశేఖర్. అదీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బర్త్ డే కానుకగా! ఆ అమౌంట్ మాత్రమే కాదు... ఇంకా బోలెడు చెప్పుకొచ్చారు.
వాయనాడ్ బాధితులకు 300 ఇళ్లు కట్టిస్తా!
Jacqueline Fernandez Birthday: ఆగస్టు 11న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బర్త్ డే. ఈ సందర్భంగా జైలు జీవితం అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాశారు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ... బాధితులకు భారీ విరాళం, అభిమానులతో పాటు తన ప్రేయసిగా చెబుతున్న జాక్వెలిన్ (Jacqueline Fernandez Sukesh Chandrasekhar)కు సైతం భారీ బహుమతి ప్రకటిస్తూ ఓ లేఖ విడుదల చేశారు.
ప్రతి ఏడాదీ అందరి వయసు పెరుగుతుంటే... జాక్వెలిన్ చిన్నది (రివర్స్ ఏజింగ్ అనాలేమో) అవుతుందని సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రయివేట్ జెట్ / యాట్చ్, డైమండ్స్ / బికినీలు ఆమెకు సంతోషాన్ని ఇవ్వవని, అందుకోసమే వాయనాడ్ బాధితులకు సాయం చేస్తున్నానని సుఖేష్ తెలిపారు. సహాయక చర్యలకు రూ. 15 కోట్లు ఇవ్వడంతో పాటు అక్కడి ప్రజలకు 300 ఇళ్లు కట్టిస్తానని వివరించారు. అందుకోసం కేరళ ప్రభుత్వంతో కలిసి పని చేయడం కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు.
అభిమానులకు 100 ఐ ఫోనులు... ప్లీజ్ సపోర్ట్!
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బర్త్ డే నేపథ్యంలో సుఖేష్ చంద్రశేఖర్ ఓ కాంటెస్ట్ రన్ చేశారు. అందులో పాల్గొన్న వారిలో 100 మందిని ఎంపిక చేశారు. వాళ్లందరికీ ఐ ఫోన్ 15 ప్రోలు బహుమతులుగా ఇస్తున్నట్లు చెప్పారు. జాక్వెలిన్‌కు ఎప్పుడూ అదే విధంగా సపోర్ట్ చేయాలని కోరారు. ఐ ఫోన్ విజేతల వివరాల్ని సైతం ఆయన ప్రకటించారు.
లేడీ జాక్వెలిన్... అందాల బొమ్మకు బహుమతిగా యాట్చ్!
బాధితులకు రూ. 15 కోట్లు, 300 ఇళ్లతో పాటు అభిమానులకు 100 ఐ ఫోనులు ఇచ్చిన సుఖేష్ చంద్రశేఖర్... జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను 'మై బేబీ గర్ల్, మై బొమ్మ జాక్వెలిన్' అని పేర్కొనడం గమనార్హం. అంతే కాదు... ఆమె కోసం ఒక ప్రైవేటు యాట్చ్ కొని, బహుమతిగా ఇచ్చారు. దానికి 'లేడీ జాక్వెలిన్' అని పేరు పెట్టినట్లు చెప్పారు. జాక్వెలిన్ పక్కన లేకుండా సెలబ్రేట్ చేస్తున్న రెండో బర్త్ డే ఇది అని, ఇది తన ఫేవరెట్ సెలబ్రేషన్ అని చెప్పుకొచ్చారు. ఈ బహుమతుల పట్ల జాక్వెలిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: చైతన్యను వదలని సమంత - శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత మళ్లీ అతడి జీవితంలోకి