మూవీ లవర్స్ తమకు ఇష్టమైన హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాయా ఇంతకు ముందు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీ ట్రెండ్ కూడా మొదలైంది. ఎప్పటికప్పుడు ఏ సినిమా, ఏ ఓటీటీలో రాబోతోంది అనే విషయాలపై మూవీ లవర్స్ కన్నేసి ఉంచుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే కాదు ఫ్యూచరిస్టిక్, స్పై, సర్వైవల్ సినిమాలంటే చెవి కోసుకునే వారి కోసమే తాజాగా ఓ సిరీస్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే పైన చెప్పుకున్న అంశాలన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే ఉండడం విశేషం. 


సిటాడెల్ యూనివర్స్ లో కొత్త పార్ట్  
    
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రయిబర్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఇటాలియన్ సిరీస్ 'సిటాడెల్ : డయానా'. ఆర్నాల్డో కాటినారి దర్శకత్వం వహించారు. అలెశాండ్రో ఫాబ్రీ రచయిత, షో రన్నర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పని చేస్తున్న గినా గార్డిని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో మటిల్డా డి ఏంజెలిస్ ప్రధాన పాత్రలో నటించారు. మౌరిజియో లొంబార్డి, జూలియా పియాటన్, లోరెంజో సెర్వసియో, గియోర్డానా ఫాగ్గియానో, డానియెల్ పాలోనీ, బెర్న్‌హార్డ్ షుట్జ్, ఫిలిప్పో నిగ్రో వంటి ఇంటర్నేషల్ స్టార్స్ కూడా భాగం అయ్యారు. 6 ఎపిసోడ్ లతో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ భారీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 10న ప్రీమియర్‌ కానుంది.


'సిటాడెల్: డయానా' స్టోరీ లైన్ విషయానికొస్తే... స్పై అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గా ఉత్కంఠభరితమైన కథతో సాగనుంది. సిరీస్ మొత్తం 2030లో మిలన్‌లో నడుస్తుంది. కథ ప్రకారం ఒకప్పుడు స్వతంత్ర ప్రపంచ గూఢచారి సంస్థగా ఉన్న సిటాడెల్ ను ఎనిమిది సంవత్సరాల క్రితం శక్తివంతమైన శత్రు సిండికేట్ మాంటికోర్ నాశనం చేస్తుంది. అయితే సిటాడెల్ కోసం పని చేస్తున్న స్పై డయానా కావలీరీ (ఏంజిలిస్) మాంటికోర్‌లో చిక్కుకుంటుంది. మరోవైపు మాంటికోర్ ఇటలీ వారసుడు, సంస్థ అధినేత ఎటోర్ జానీ (లోంబార్డి) కుమారుడు ఎడో జాని (సెర్వసియో) ఇతర యూరోపియన్ కుటుంబాలకు వ్యతిరేకంగా నాయకత్వం కోసం పోటీ పడతాడు. ఈ నేపథ్యంలోనే డయానా తన మిత్రుడైన ఎడో సాయంతో తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. మరి ఆమె అనుకున్నట్టుగా మాంటికోర్ నుంచి తప్పించుకుందా? ప్రాణాలతో బయట పడిందా? అన్న ఇంట్రెస్టింగ్ విషయాలను చూడాలంటే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 10న స్ట్రీమింగ్ అయ్యేదాకా చూడాల్సిందే. 


Read Also: ఆడపులికి కాబోయే వాడు ఇన్ని లక్షణాలు ఉండాలట, అలాంటి వాడు అసలు భూమ్మీద ఉన్నాడా?


సిటాడెల్ ఫ్రాంఛైజీ కోసం ఫ్యూచర్ ప్లాన్


ఒరిజినల్ సిటాడెల్ సిరీస్ 2023లో వచ్చిన సంగతి ఓటీటీ మూవీ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ ఇందులో జంటగా నటించారు. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ గా భారీ బడ్జెట్ తో రిలీజైన ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ యూఎస్ లో మాత్రం ప్రైమ్ వీడియోలో అత్యధికంగా వీక్షించిన నాలుగవ ఒరిజినల్ సిరీస్ గా రికార్డును క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది. మరోవైపు వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ ఇండియన్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ నవంబర్ 7న ప్రీమియర్ అవుతుంది. ఇప్పుడు సిటాడెల్ ఇటలీ వెర్షన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 


Read Also: వాళ్లిద్దరూ తేనెపూసిన కత్తులు... హౌస్ నుంచి బయటకు వచ్చాక బేబక్క షాకింగ్ కామెంట్స్