Bigg Boss Bebakka Shocking Comments: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తొలి వారం కంప్లీట్ అయ్యింది. ఈ వారం షో అనుకున్న స్థాయిలో వినోదం పంచలేదు. కంటెస్టెంట్ల గొడవలు, ఏడుపులతోనే ముందుకు సాగింది. తొలి వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో నిలవగా, బేబక్క ఎలిమినేట్ అయ్యింది. కేవలం వారం రోజుల్లోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క షో గురించి, షోలోని కంటెస్టెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
వాళ్లిద్దరు తేనెపూసిన కత్తులు- బేబక్క
బిగ్ బాస్ షో చాలా కొత్తగా ఉందని చెప్పిన బేబక్క అర్థం అయ్యేలోపు బయటకు వచ్చేశానని చెప్పింది. తోటి కంటెస్టెంట్లు నిఖిల్, సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “బిగ్ బాస్ షో చాలా కొత్తగా అనిపించింది. అర్థం అయ్యేలోపు బయటకు వచ్చాను. నేను చాలా ఇష్టపడి నిఖిల్ టీమ్ లోకి వెళ్లాను. ముళ్ల కిరీటాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకున్నాను. తను ఎంతసేపు సోనియానే తన టీమ్ లో ఉండాలి. ఆమే స్ట్రాంగ్ అనుకుంటాడు. నిఖిల్, సోనియా లోపల బాగా క్లోజ్ గా ఉండటం అందరూ చూస్తున్నారు. నిఖిల్, సోనియా తేనె పూసిన కత్తులు అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. సోనియా గట్టిగా పాయింట్ ను రైజ్ చేసి రెచ్చగొడితే అందరికీ అదే అనిపించింది. బిగ్ బాస్ లో కుక్కర్ తన జీవితాన్నే తలకిందులు చేసింది. హౌస్ ఇప్పటి వరకు తన మీద ఉన్న ప్రెషర్ సీత మీద పడే అవకాశం ఉంది. నిఖిల్ ఖాళీ చెంచాలతో సమానం. హౌస్ లో మసాలా లాంటి అమ్మాయి విష్ణు ప్రియ. సోనియా దగ్గరికి వెళ్తే మిరపకాయ పేలినట్లు పేలుతుంది. కావాలనే ట్రిగ్గర్ చేస్తుంది” అని చెప్పుకొచ్చింది.
బేబక్క ఎలిమినేషన్ పై విమర్శలు
తొలివారంలోనే బేబక్కను ఎలిమినేట్ చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వస్తున్నాయి. హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే బేబక్క చాలా బెటర్ అంటున్నారు. మరికొంత మంది ఆమెతో బిగ్ బాస్ నిర్వాహకులు వారం రోజులే కాంట్రాక్ట్ తీసుకున్నారేమో అందుకే పంపించారని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు తను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయినా బాధపడాల్సిందేమీ లేదని బేబక్క చెప్పింది. బిగ్ బాస్ తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నది. తనకు సపోర్టు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది. షో నుంచి బయటకు వచ్చాక మరో కొత్త అధ్యాయం మొదలవుతుందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
సింగర్ గా మంచి గుర్తింపు..
బేబక్క సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. బెజవాడ బేబక్కగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే హౌస్ లోకి అడుగు పెట్టింది. అయితే, హౌస్ లో ఏమాత్రం యాక్టివ్ గా లేని వాళ్లను వదిలేసి బేబక్క ను ఎలిమినేట్ చేయడం ఏంటని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
Read Also: బాడీ షేమింగ్ మానుకోండి- మణికంఠ భార్యకు అండగా నిలిచిన మరదలు