Director Chandra Sekhar Yeleti is stepping into the OTT world with web series: చంద్రశేఖర్ యేలేటి... తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు. హాలీవుడ్ కంటే ఒక అడుగు ముందు సినిమాలు తీసిన దర్శకుడు. తెలుగులో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్న 'ఐతే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చంద్రశేఖర్ యేలేటి... ఆ తర్వాత 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'సాహసం', 'మనమంతా', 'చెక్' వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.


ఈటీవీ విన్ కోసం యేలేటి ఒరిజినల్ సిరీస్!
ప్రముఖ తెలుగు టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీకి చెందిన ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ యాప్ (ETV Win APP) కోసం చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ సిరీస్ (Web Series Telugu) దర్శకుడు మాత్రం చంద్రశేఖర్ యేలేటి కాదు. అసలు విషయం ఏమిటంటే?


నిర్మాతగా మారుతున్న చంద్రశేఖర్ యేలేటి!
అవును... దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి నిర్మాతగా మారుతున్నారు. అది కూడా ఈటీవీ విన్ ఓటీటీ కోసం! ఆయన నిర్మాణంలో, ఆయన షో రన్నర్‌గా ఈటీవీ విన్ యాప్ ఓటీటీ కోసం ఒక ఒరిజినల్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సిరీస్ నిర్మాణ దశలో ఉంది. అందులో నటీనటులు ఎవరు? దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది? వంటి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఒక్క వెబ్ సిరీస్ మాత్రమే కాదని... చంద్ర శేఖర్ యేలేటి నిర్మాణ సంస్థ నుంచి వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.


Also Read'కల్కి 2898 ఏడీ' హిందీ డిజిటల్ రైట్స్‌లో ట్విస్ట్ - రెండు ఓటీటీల్లో Prabhas సినిమా!



హాలీవుడ్ కంటే ముందున్న చంద్రశేఖర్ యేలేటి!
దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి తీసిన సినిమాల సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. 'ఐతే'తో 2003లో కెరీర్ స్టార్ట్ చేస్తే... 2021లో వచ్చిన 'చెక్' వరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏడు మాత్రమే. ముఖ్యంగా 'ఒక్కడున్నాడు' (2007) సినిమాలో ఆయన టేకప్ చేసిన కాన్సెప్ట్ మీద ఐదేళ్ల తర్వాత హాలీవుడ్ సినిమా 'గెట్ ది గ్రింజో' (2012) రావడం విశేషం. హాలీవుడ్ ఫిల్మ్ 'హ్యాంగోవర్' 2009లో వస్తే... ఆ తరహా కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ 'అనుకోకుండా ఒక రోజు'ను 2005లో తీశారు చంద్రశేఖర్ యేలేటి. అందువల్ల, ఆయన నిర్మాణంలో రాబోయే వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.


Also Read: Animal హీరోయిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జనాలు - Bad Newz రిలీజ్ డేట్, ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా?


ఈటీవీ విన్ యాప్ ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ 'నైంటీస్'తో పాటు మరికొన్ని ఫిల్మ్స్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని ఒరిజినల్ సిరీస్‌లు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో అగ్ర దర్శకులతో ఈటీవీ విన్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరితో కొన్ని ప్రాజెక్టులు సెట్స్ మీదకు తీసుకు వెళ్లినట్టు తెలిసింది.