రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకోన్ (Deepika Padukone) ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ తీసుకుందో తెలుసా?


నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి 'కల్కి' హిందీ స్ట్రీమింగ్
Kalki 2898 AD Hindi Version OTT Rights acquired by Netflix: 'కల్కి 2898 ఏడీ' రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. ఇవాళ థియేటర్లలో సినిమా విడుదల కాగా... హిందీ వెర్షన్ స్క్రీన్లలో తమ ఓటీటీ పార్ట్‌నర్ అని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 175 కోట్లు అని సమాచారం.


Also Read: 'కల్కి 2898 ఏడీ' రివ్యూ: సినిమా విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా? ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?



ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు సౌత్ వెర్షన్స్!
Kalki 2898 AD South Languages OTT Platform: 'కల్కి 2898 ఏడీ' హిందీ వెర్షన్ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకోగా... తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది. నాలుగు భాషల కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఇచ్చారట. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ బుజ్జి, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా రూపొందిన 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ సైతం ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆల్రెడీ రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరో రెండు ఎపిసోడ్స్ త్వరలో విడుదల కానున్నాయి.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు



ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ... థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్!
Kalki 2898 AD Review: గురువారం (జూన్ 27న) 'కల్కి 2898 ఏడీ' థియేటర్లలోకి వచ్చింది. ఉదయం నాలుగు గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోస్ పడ్డాయి. మన భారతీయ కాలమానం ప్రకారం ఒంటి గంట సమయం నుంచి అమెరికాలో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. సినిమా రిజల్ట్ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. థియేటర్లలో ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 


అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ బ్రేక్ చేసిన 'కల్కి 2898 ఏడీ'
Kalki 2898 AD premiere show collections USA: అమెరికాలో 'కల్కి 2898 ఏడీ' కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ కొత్త చరిత్ర సృష్టించింది. ఆల్రెడీ 3.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ రోజు పూర్తి అయ్యేసరికి మరిన్ని కలెక్షన్స్ రావచ్చు.