Director Shankar Open Up on Game Changer Release: మెగా ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తూ డైరెక్టర్‌ శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కమల్‌ హాసన్‌ 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ జూలై 12న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు 2 ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన 'గేమ్‌ ఛేంజర్‌' అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో మూవీపై వస్తున్న రూమర్స్‌, అపోహాలకు చెక్‌ పడింది.  


ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇంకా రామ్‌ చరణ్‌ మూవీ ఒకటి థియేటర్లోకి రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చరణ్‌ చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్‌ ఇది. మూవీ సెట్స్‌పైకి వచ్చి కూడా ఏడాదిన్నర అవుతుంది. కానీ ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏం రావడం లేదు. ఇక మూవీ కూడా బ్రేక్స్‌ మీద బ్రేక్స్‌ తీసుకుంటూ షూటింగ్‌ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ లుక్‌ తప్పితే ఫ్యాన్స్‌ ఆశించిన అప్‌డేట్‌ ఏం రావడం లేదు. దీంతో అసలు గేమ్‌ ఛేంజర్‌ మూవీ ఉందా? క్యాన్సల్‌ చేశారా? అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ దర్శనం ఇస్తున్నాయి. ఈ తరుణంలో మెగా ఫ్యాన్స్‌ అంతా 'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


గేమ్ ఛేంజర్ గురించి ఏమన్నారంటే..


ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ శంకర్‌ ఇచ్చిన అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్‌లో శంకర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శంకర్‌ గేమ్‌ చేంజర్‌ గురించి ఏమన్నారంటే.. మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తయిపోయింది. ఇంకా పది రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. ఇండియన్ 2 మూవీ రిలీజ్‌ అవ్వగానే ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్‌ ఫూటేజ్‌ లాక్‌ చేసి ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌పై దృష్టి పెడతాను. అన్ని పనులు పూర్తయ్యాక సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్ణయించి వీలైనంత త్వరగా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తాం" అని పేర్కొన్నారు. స్వయంగా డైరెక్టర్‌ శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. 



ఇక మూవీ విషయంలో వస్తున్న రూమర్స్‌ అన్నింటికి చెక్‌ పడినట్టు అయ్యింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు. అలాగే ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హీరో సిద్ధార్థ్‌ కూడా గేమ్‌ ఛేంజర్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెబుతూ 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా గురించి హింట్ ఇచ్చాడు. 2000 మందితో 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా షూటింగ్ జ‌రుగుతుంద‌ని చెప్పడంతో 'గేమ్‌ ఛేంజర్‌' మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరిష్ గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తున్నారు. ఇందులో కియార అద్వానీ హీరోయిన్ నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Read: సినిమాని, క్రాఫ్ట్‌ని గౌరవిద్దాం.. దయచేసి థియేటర్లో అలాంటివి చేయకండి - ఆడియన్స్‌కి 'కల్కి' నిర్మాతల రిక్వెస్ట్‌