Malaika Shared Cryptic Post on Arjun Birthday: మరోసారి బాలీవుడ్‌ లవ్ బర్డ్స్‌ మలైకా ఆరోరా, అర్జున్‌ కపూర్‌ బ్రేకప్‌ రూమర్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కొన్నేళ్లుగా డేటింగ్‌గా ఉన్న ఈ జంట బ్రేకప్‌ చెప్పుకుందంటూ  బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మీడియాల్లోనూ కథనాలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఈ జంటను క్లారిటీ లేదు. మరోవైపు కొన్ని రోజులుగా  ఎప్పుడైనా, ఎక్కడికైనా కపుల్‌గా కనిపించే వీరిద్దరు పెద్దగా కలుసుకోవడం లేదు. ఎక్కడా కూడా జంటగా కనిపించడం లేదు. ఈ క్రమంలో వీరిద్దరి రిలేషన్‌లో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అయ్యిందంటూ రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి.


కానీ ఈ మధ్య వాటిని కొట్టిపారేసే ప్రయత్నం చేసింది మలైకా. కానీ, బ్రేకప్‌ రూమర్స్‌ని స్రాంగ్‌ ఖండించలేకపోయింది.  దీంతో అసలు ఈ జంట మధ్య ఏం జరుగుతుందో అర్థంకాక నెటిజన్లు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. ఈ క్రమంలో మలైకా చేసిన పనితో బ్రేకప్‌ రూమర్స్‌పై క్లారిటీ వచ్చిందనిపిస్తుంది. కారణం నిన్న(జూన్‌ 26) అర్జున్‌ కపూర్‌ బర్త్‌డే. అంతా అతడికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ప్రియుడిని విష్‌ చేయడంలో ప్రతి ఏడాది ముందుండే మలైకా మాత్రం అతడికి విష్‌ చేయలేదు.. పైగా నమ్మకమంటే ఎలా ఉంటుందో చెబుతూ ఓ క్రిప్టిక్‌ పోస్ట్‌ పెట్టింది. దీంతో అంతా వీరిద్దరి రిలేషన్‌లో మనస్పర్థలు వచ్చాయని ఫిక్స్‌ అయ్యారు. 






ఇంతకి మలైకా పోస్ట్‌ ఏం చేసిందంటే..


ఓ వైపు కుటుంబ సభ్యులు అర్జున్‌ కపూర్‌ బర్త్‌డే సలబ్రేట్‌ చేశారు. హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ కూడా వెళ్లింది. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఇలా పలువురు అర్జున్‌ కపూర్‌ సన్నిహితులు కూడా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అర్జున్‌ కపూర్‌ సోదరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.  అయితే  వీడియో ఎక్కడా కూడా మలైకా కనిపించలేదు. ఏమైందా అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తూ అర్జున్‌ కపూర్‌కి విష్‌ చేయాల్సింది బదులుగా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. "నేను కళ్లు మూసుకుని వెనక్కి తిరిగినా కూడా నేను నమ్మే వ్యక్తులనే ఇష్టపడతాను" అంటూ ఆమె పోస్ట్‌ షేర్‌ చేసింది. దీంతో అర్జున్‌-మలైకా రిలేషన్‌లో మనస్పర్థలు వచ్చాయని ఈ జంట ఫాలోవర్స్‌ ఫిక్స్‌ అయిపోతున్నారు. మరి ఈ బ్రేకప్‌ రూమర్స్, వార్తలపై ఈ జంట ఎలా స్పందిస్తూ.. ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. 



కాగా రీసెంట్‌గా ఇండస్ట్రీ వర్గానికి చెందిన కొందరు అర్జున్‌-మలైకాలో విడిపోయారన్నది నిజమని ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కన్‌ఫాం చేశారు. కానీ, వీటిని మలైకా కొట్టిపారేసింది.. కానీ అర్జున్‌ కపూర్‌ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. ఎప్పుడు వీరి రిలేషన్‌పై ఎలాంటి రూమర్‌, ట్రోల్స్‌ వచ్చినా రియాక్ట్‌ అయ్యే అర్జున్‌ కపూర్‌ తమ బ్రేకప్‌ రూమర్స్‌ని మాత్రం ఖండించడం లేదు. ఈ క్రమంలో మలైకా పెట్టిన పోస్ట్‌తో వీరిద్దరు విడిపోయారని అంతా ఫిక్స్ అవుతున్నారు. 



Also Read: Prabhas 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్, మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అందులోనే!