Kalki 2898 AD OTT Rights: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఆల్రెడీ అమ్మేశారు. ఇంతకీ, ఏ సంస్థ సొంతం చేసుకుందో తెలుసా?


అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీకి 'కల్కి'
Kalki 2898 AD OTT rights acquired by Amazon Prime Video: కల్కి 2898 ఏడీ డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. థియేటర్లలో ఈ విషయాన్ని వెల్లడించారు. తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని 'కల్కి 2898 ఏడీ' సినిమా టైటిల్ కార్డ్స్ ముందు తెలిపారు.


Also Read: కల్కి 2898 ఏడీ ఆడియన్స్ రివ్యూ: Mahabharat ఎపిసోడ్, ఫస్ట్ ఫైట్‌తోనే వందకు 100 - Prabhas సినిమా టాక్ ఎలా ఉందంటే?



'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ క్యారెక్టర్ భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా ఒక వెబ్ సిరీస్ రూపొందించిన సంగతి తెలిసిందే. అందులో రెండు ఎపిసోడ్స్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరొక రెండు ఎపిసోడ్స్ త్వరలో విడుదల కానున్నాయి. 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ (Prabhas Kalki Movie OTT partner)తో పాటు సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థకు ఇచ్చారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి ఈ మూవీ వస్తుందని తెలిసింది.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు



'కల్కి 2898 ఏడీ' సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించగా... లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవికా నాయర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.