Prabhas Kalki 2898 AD Movie Review: రెబల్ స్టార్ రాంపేజ్ మొదలైందని ఎన్నారై, అమెరికా ఆడియన్స్ - సోషల్ మీడియా లోకం అంటోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ సినిమా 'కల్కి 2898 ఏడీ'కి ఓవర్సీస్ నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తోంది.


వైజయంతీ మూవీస్ పతాకంపై సుమారు 600 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD Review) మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోవడం ఖాయమని అమెరికాలో ప్రీమియర్ షోస్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూస్తుంటే అర్థం అవుతోంది.






మహాభారతం ఎపిసోడ్... 30 నిమిషాలు కేక!
Kalki 2898 AD First Review: 'కల్కి 2898 ఏడీ' సినిమాలో మొదటి 30 నిమిషాలు మహాభారతం ఎపిసోడ్ వస్తుందని ఒక నెటిజన్ తెలిపారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అద్భుతంగా ఉందని చెప్పారు. ఒక డివైన్ ఫీలింగ్ వచ్చిందని అన్నాడు. అసలు ఆ 30 నిమిషాలు సలార్ సినిమా కంటే ఎన్నో రేట్లు ఎక్కువ అని చెప్పాడు మరొక నెటిజన్.














ఇండియన్ స్క్రీన్ మీద చూడని సెటప్!
Prabhas Kalki 2898 AD Review: ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రేక్షకులు చూడనటువంటి విజువల్స్, సెటప్ 'కల్కి 2898 ఏడీ'లో ఉన్నాయని మరొక నెటిజన్ చెప్పాడు. స్టోరీలైన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉందని అతడు తెలిపాడు. ఫస్టాఫ్ వరకు ప్రభాస్ క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ... ఆయన రోల్ చాలా బావుందని చెప్పాడు.



ఇంటర్వెల్ బ్లాక్ ఫస్టాఫ్ అంతటికీ హైలైట్!
Prabhas Kalki First Review: 'కల్కి 2898 ఏడీ' సినిమా ఫస్టాఫ్ అంతటికీ ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్ అవుతుందని అమెరికా నుంచి ఒక నెటిజన్ పేర్కొన్నాడు. విశ్రాంతి వరకు వచ్చే సినిమాలో స్క్రీన్ ప్లే ఏమీ అంత గొప్పగా లేదని, విజువల్స్ - ఫైట్స్ మాత్రం అదిరిపోయాయని అన్నారు.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు






బుజ్జితో రెబల్ స్టార్ కెమిస్ట్రీ అదుర్స్ అంతే!
'కల్కి 2898 ఏడీ'లో సూపర్ కార్ బుజ్జిని పరిచయం చేయడం కోసం స్పెషల్ ఈవెంట్ చేశారు. ఆ కారుకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది సినిమా చూస్తే అర్థం అవుతోంది. బుజ్జితో ప్రభాస్ కెమిస్ట్రీ అదిరిపోయిందని నెటిజనులు అంటున్నారు.


Also Read: విజయ్ దేవరకొండ 'కల్కి' కాదు... ప్రభాస్ సినిమాలో ఆయన రోల్ ఏమిటంటే?



విజువల్ ఫీస్ట్ గ్యారంటీ... అందులో నో డౌట్!
Kalki 2898 AD Review: 'కల్కి 2898 ఏడీ' థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ గ్యారంటీ అని ఎర్లీ రివ్యూస్, అమెరికా రిపోర్ట్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మేజిక్ ఎప్పటికీ గుర్తు ఉండేలా ఉంది.