'తెలుగు ఇండియన్ ఐడల్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన రేవంత్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తారని అన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా శ్రీరామచంద్ర పేరుని అనౌన్స్ చేశారు. రేవంత్ ని తప్పించి శ్రీరామ్ కు ఛాన్స్ ఇచ్చారా..? లేక ఇద్దరూ హోస్ట్ చేయబోతున్నారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. ప్రస్తుతానికైతే హోస్ట్ గా శ్రీరామచంద్ర కనిపించబోతున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీరామచంద్ర టాప్ 5 వరకు చేరుకున్నాడు. కప్పు కూడా గెలుస్తాడని ఆయన అభిమానులు ఆశించారు కానీ అలా జరగలేదు. గతంలో ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన శ్రీరామ్ కి ఇప్పుడు ఆ షో తెలుగులో హోస్ట్ చేసే ఛాన్స్ రావడం విశేషం.
ఇక ఆహా సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా టాక్ షోలతో డిజిటల్ వ్యూవర్స్‌కి సరికొత్త అనుభూతిని పంచేందుకు వివిధ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆరంభంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ టాక్ షో నిర్వహించి టాలీవుడ్ బిగ్ సెలబ్రెటీలతో సందడి చేయించింది. రీసెంట్ గా బాలకృష్ణ హోస్ట్ గా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' స్టార్ట్ చేసి క్రేజీ రెస్పాన్స్ ను దక్కించుకుంది 'ఆహా'.
ఇప్పుడేమో ఇండియన్ ఐడల్ తెలుగు వెర్షన్ ను మొదలుపెడుతోంది. హిందీలో 12 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులో లేదు. తెలుగు సింగింగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..
Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..
Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..
Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..