తెలుగు బుల్లితెర వీక్షకులకు, వెండితెర ప్రేక్షకులకు యాంకర్ గీతా భగత్ (Geetha Bhagat) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్పాంటేనియస్ పంచ్ డైలాగులు, ఛలోక్తులతో కార్యక్రమాలను విజయవంతం చేస్తుంటారు. ఆమె ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈటీవీ విన్ ఓటీటీ కోసం ఒక షార్ట్ మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో...
ఈటీవీ విన్ 'తను రాధే నేను మధు'!
కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే కంటెంట్ అందిస్తున్న తెలుగు ఓటీటీ ఈటీవీ విన్. కొన్ని వారాల నుంచి 'కథా సుధ' పేరుతో వారానికి ఒక షార్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 'తను రాధే... నేను మధు' అని ఓ షార్ట్ మూవీ విడుదలైంది. దానిని ప్రొడ్యూస్ చేసినది యాంకర్ గీతా భగత్.
'తను రాధే... నేను మధు' షార్ట్ మూవీ లెంగ్త్ 33 నిమిషాలు మాత్రమే. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించారు. ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి ఇతర ముఖ్య తారాగణం. విదేశాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ షార్ట్ మూవీ తెరకెక్కింది. స్వచ్ఛమైన ప్రేమ, ఓ జంట మధ్య నమ్మకం, సహనం, భావోద్వేగం వంటివి మిళితం చేసి ఆర్పీ పట్నాయక్ ఈ షార్ట్ మూవీ తెరకెక్కించారు. దీనిని ఓటీటీల్లో మంచి స్పందన లభిస్తోంది.
Also Read: సుందరకాండ ఓటీటీ రిలీజ్... ఐదు భాషల్లో నారా రోహిత్ సినిమా స్ట్రీమింగ్... ఎప్పట్నించి అంటే?
సినిమా ఈవెంట్స్, స్పెషల్ ఇంటర్వ్యూలు, ఫెస్టివల్ ప్రోగ్రామ్స్... కొన్ని వందల కార్యక్రమాలను గీతా భగత్ హోస్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం సొంతం చేసుకున్నారు. రఘురాం బొలిశెట్టితో కలిసి 'తను రాధే... నేను మధు' షార్ట్ మూవీని ఆవిడ ప్రొడ్యూస్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అంతా అమెరికాలో జరిగింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారని ఆవిడ ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో 'తను రాధే... నేను మధు' ట్రెండింగ్‌లో ఉంది.
Also Read: త్వరలో ఓటీటీకి 'జూనియర్'... కిరీటి రెడ్డి, శ్రీ లీల సినిమా స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?