ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి (Gali Kireeti Reddy) కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'జూనియర్' (Junior Movie 2025). ఇందులో అతడి సరసన యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల (Sreeleela) నటించారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు. ఎక్కువ రోజులు ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

ఆహా... త్వరలో జూనియర్ స్ట్రీమింగ్!Junior Movie 2025 OTT Release Update: ''జ్ఞాపకాలు, ప్రేమ, నమ్మలేని నిజం... త్వరలో అందరికీ తెలుస్తాయి. జూనియర్...  త్వరలో ఆహా లోకి వస్తుంది'' అని ఆహా ఓటీటీ పేర్కొంది. ఈ శుక్రవారం... సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

'జూనియర్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో దగ్గర కూడా ఉన్నాయని, ఇతర భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ ఆ ప్లాట్‌ఫార్మ్‌ సొంతం చేసుకుందని టాక్. తెలుగు, కన్నడ భాషలలో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ భాషలలోనూ అనువదించి స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

Also Readఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్‌ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!

జూనియర్ కథ ఏమిటి? జెనీలియా రోల్!?'జూనియర్' సినిమాలో కిరీటి రెడ్డి శ్రీ లీల జంటగా నటించగా... హీరో తండ్రి పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్, కథలో కీలకమైన పాత్రలో 'బొమ్మరిల్లు' ఫేమ్ జెనీలియా నటించారు. 

తమకు లేక లేక పుట్టిన కొడుకు (కిరీటి) మీద తండ్రి (రవిచంద్రన్) అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అది తట్టుకోలేని కొడుకు తండ్రికి దూరంగా వెళ్లి జీవించాలని అనుకుంటాడు. చదువు పూర్తి అయిన తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగానికి చేరుతాడు. అక్కడ ఆ కంపెనీకి కాబోయే సీఈవో విజయ సౌజన్య దృష్టిలో మొదటి రోజు బ్యాడ్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. 

కిరీటి రెడ్డి, జెనీలియా పాత్రల మధ్య సంబంధం ఏమిటి? తండ్రిగా రవిచంద్రన్ చేసింది ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రానికి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటికి చెందిన వారాహి చలన చిత్రం పతాకం మీద రజనీ కొర్రపాటి నిర్మించారు.

Also Readరామ్ చరణ్ 'పెద్ది' ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది... విజయదశమి కానుకగా మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్!