మెగా అభిమానులకు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు విజయ దశమి గిఫ్ట్ రెడీ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie). అందులో ఫస్ట్ సింగిల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Continues below advertisement

అక్టోబర్ 2న పెద్ద ఫస్ట్ సాంగ్ విడుదల!Peddi first single release date: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటు హీరో రామ్ చరణ్, అటు దర్శకుడు బుచ్చిబాబు... ఇద్దరితో రహమాన్ ఫస్ట్ సినిమా ఇది. ఆల్రెడీ టైటిల్ గ్లింప్స్‌కు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఒక రేంజ్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దాంతో సినిమాలో పాటలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి రెడీ అవుతుండడంతో ఫ్యాన్స్ అంతా దాని కోసం ఎదురు చూస్తున్నారు.

Continues below advertisement

Also Read: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ @ 350 కోట్లు... బడ్జెట్ ఎంతో తెలుసా?

Peddi First Song Release On October 2nd: దసరా సందర్భంగా అక్టోబర్ రెండున పెద్ది సినిమాలో మొదటి పాట విడుదల కానుంది. దాంతో ఇప్పటి నుంచి హంగామా మొదలు అయింది.

చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా! 'పెద్ది' సినిమాను భారీ నిర్మాణవ్యయంతో వృద్ధి సినిమాస్ పతాకం మీద సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి ఆల్రెడీ చిత్రీకరణ చాలా వరకు చేశారు. సుమారు 75 రోజులకు పైగా షూటింగ్ చేశారు. మరొక 80 రోజులు షూటింగ్ చేయవలసి ఉంటుందని సమాచారం. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలోకి తీసుకు రానున్నారు. 

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానున్న 'పెద్ది' సినిమాలో నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ హీరోయిన్. 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనతో పాటు కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్‌ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!